Trisha: అప్పుడే నాకు అసలైన ప్రశాంతత.. ఇన్‌స్టాలో త్రిష షాకింగ్ పోస్ట్
చెన్నై చిన్నది త్రిష(Trisha) చేసిన పోస్ట్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
- V Santhosh Kumar
- Published on- April 30, 2026 / 10:24 AM IST
Trisha post about sleep has gone viral on the internet.
- త్రిష రాజకీయ ఎంట్రీపై జోరుగా ప్రచారం
- నిద్రలేమిపై త్రిష చేసిన క్రేజీ పోస్ట్
- సినిమాలతో బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్
Trisha: సౌత్ స్టార్ బ్యూటీ త్రిష ప్రస్తుతం అటు సినిమాలు, ఇటు రాజకీయ వార్తలతో సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది. ముఖ్యంగా నటుడు విజయ్ రాజకీయ పార్టీ ‘తమిళగ వెట్రికళగం’తో ఆమె పేరు ముడిపడటంతో, త్రిష రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే సినిమాలకు గుడ్ బై చెబుతారన్న వార్తలు కూడా వైరల్ అయ్యాయి. కానీ, తాజాగా ఈ న్యూస్ కి క్లారిటీ కూడా ఇచ్చింది త్రిష.
Pooja Hegde: పూజా హెగ్డే ప్రేమాయణం.. బాలీవుడ్ నటుడితో బుట్టబొమ్మ డేటింగ్?
ఇదిలా ఉంటే, తాజాగా త్రిష (Trisha)ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఒక వినూత్న పోస్ట్ అభిమానులను అయోమయంలో పడేసింది. ఒక గంట నిద్ర కోల్పోతే, దాని నుండి కోలుకోవడానికి నాలుగు రోజులు పడుతుందని, ఆ లెక్కన తాను 2062లో గానీ ప్రశాంతంగా ఉండలేనని అంటూ రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్ గా మారింది. త్రిష చేసిన ఈ పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
త్రిషకు సరిగ్గా నిద్ర పట్టడం లేదా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమె మానసిక ఒత్తిడికి లోనవుతున్నారా లేదా సరదాగా ఈ వ్యాఖ్యలు చేశారా అనే చర్చ నడుస్తోంది. రాత్రిపూట ఎక్కువగా మేలుకొని ఉండే అలవాటు ఉన్న త్రిష, తన నిద్రలేమి సమస్యను వ్యంగ్యంగా చెప్పిందా లేక ఏదైనా నిగూఢ అర్థం ఉందా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. మొత్తానికి తన నిద్ర గురించిన లెక్కలతో త్రిష మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చారు. ఇక త్రిష హీరోయిన్ గా నటించిన కరుప్పు సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
