×
Ad

Trivikram – Naga Vamsi : తెలుగు రాష్ట్రాలకు త్రివిక్రమ్, పవన్ నిర్మాతలు సాయం.. ఎంతంటే..?

ఈ క్రమంలో దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు ఎస్. రాధాకృష్ణ (చినబాబు), ఎస్. నాగవంశీలు కూడా రెండు రాష్ట్రాలకు విరాళం ప్రకటించారు.

  • Published On : September 3, 2024 / 12:28 PM IST

Trivikram and Producers Chinababu Naga Vamsi Huge Donation to Telugu States

Trivikram – Naga Vamsi : గత కొన్ని రోజులుగా కురుస్తున్న వానలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రదేశాలు వరదలతో విలవిలలాడుతున్నాయి. ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. ఈ క్రమంలో సినీ ప్రముఖులు రెండు తెలుగు రాష్ట్రాలకు తమకు తోచినంత విరాళం ఇస్తున్నారు. ఇప్పటికే ఆయ్ మూవీ యూనిట్, కల్కి నిర్మాతలు, ఎన్టీఆర్, విశ్వక్ సేన్.. పలువురు సినీ ప్రముఖులు రెండు రాష్ట్రాలకు సాయం అందించారు.

ఈ క్రమంలో దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు ఎస్. రాధాకృష్ణ (చినబాబు), ఎస్. నాగవంశీలు కూడా రెండు రాష్ట్రాలకు విరాళం ప్రకటించారు. దీనిపై హరికహాసిని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

Also Read : Jr NTR : తెలుగు రాష్ట్రాల్లో వరదలు.. దేవర భారీ విరాళం.. ఎంతో తెలుసా?

హారిక హాసిని నిర్మాణ సంస్థ తమ ట్విట్టర్లో.. గత కొద్ది రోజులుగా అటు ఆంధ్ర, ఇట్లు తెలంగాణ రాష్ట్రాలు ప్రకృతి వైపరీత్యాలతో తల్లడిల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో సంయుక్తంగా 50 లక్షలు విరాళం ప్రకటించారు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు ఎస్. రాధాకృష్ణ (చినబాబు), ఎస్. నాగవంశీ, ఏపీకి రూ.25 లక్షలు, తెలంగాణకు రూ.25 లక్షలు, ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. భారీ వర్షాల వల్ల ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఆస్తి, ప్రాణ నష్టాలు మమ్మల్ని ఎంతగానో కలచి వేశాయి. ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ మా వంతు సాయంగా చేయూత అందిస్తున్నాము అని తెలిపారు. దీంతో నెటిజన్లు, అభిమానులు త్రివిక్రమ్, నిర్మాతలను అభినందిస్తున్నారు.