Prabhas : ప్రభాస్ తో గురూజీ సినిమా.. త్రివిక్రమ్ ఏమన్నాడంటే.. అసలు అది అయ్యే పనేనా..?

తాజాగా త్రివిక్రమ్ ప్రభాస్ తో సినిమా గురించి మాట్లాడటంతో త్రివిక్రమ్ - ప్రభాస్ కాంబో సినిమా అనే వార్త వైరల్ గా మారింది.(Prabhas)

  • Published on- October 27, 2026 / 05:04 PM IST

Prabhas

Prabhas : ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. భారీ సినిమాల లైనప్ పెట్టుకున్నాడు. ఏ దర్శకుడికి అవకాశం ఇస్తాడో కూడా ఊహించలేకపోతున్నాము. తాజాగా త్రివిక్రమ్ ప్రభాస్ తో సినిమా గురించి మాట్లాడటంతో త్రివిక్రమ్ – ప్రభాస్ కాంబో సినిమా అనే వార్త వైరల్ గా మారింది.

జగపతి బాబు జయమ్ము నిశ్చయమ్మురా షోకి వచ్చిన త్రివిక్రమ్ ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. ప్రభాస్‌ లో ఉన్న హ్యూమర్ యాంగిల్‌ ను ఎవరూ పూర్తిస్థాయిలో వాడలేదు. నేను ప్రభాస్ తో సినిమా చేస్తే యాక్షన్, ఎమోషన్ తో పాటు కామెడీ బాగా ఉండేలా సినిమా చేస్తాను అని తెలిపారు. బాహుబలికి ముందు సినిమాల్లో ప్రభాస్ కామెడీ బాగుండేది. కానీ పాన్ ఇండియా సినిమాల్లో యాక్షన్ మీద ఫోకస్ చేయడంతో అసలు కామెడీనే ఉండట్లేదు. ఇటీవల రాజాసాబ్ లో కామెడీ చేసినా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఫ్యాన్స్ తమ పాత ప్రభాస్ ని చూడాలని అనుకుంటున్నారు. బయట కూడా ప్రభాస్ కి మంచి హ్యూమర్ ఉందని తెలిసిందే.

Also Read : Poorvaaj : కోటి రూపాయల కాంటెస్ట్ నిజమే.. జ్యోతి పూర్వజ్ ‘కిల్లర్’ సినిమాపై దర్శకుడు..

దీంతో త్రివిక్రమ్ ప్రభాస్ తో సినిమా చేస్తాను అని చెప్పడంతో ఫ్యాన్స్ ఈ కాంబో కోసం ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్ సినిమా అంటే ఫ్యామిలీ ఎమోషన్స్, మంచి డైలాగ్స్, కామెడీ, యాక్షన్ కూడా ఉంటాయి. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. అయితే ఇప్పుడు ప్రభాస్ ఉన్న పరిస్థితుల్లో త్రివిక్రమ్ తో పాన్ ఇండియా సినిమా వర్కౌట్ అవుతుందా అంటే సందేహమే.

ప్రభాస్ చేతిలో ప్రస్తుతం ఫౌజీ, కల్కి-2, స్పిరిట్, సలార్ 2 ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకో రెండు సినిమాలు ఒప్పుకున్నాడు. ఇవన్నీ అయ్యేదాకా త్రివిక్రమ్ ఆగాలి. మరో వైపు త్రివిక్రమ్ త్వరలో ఎన్టీఆర్ తో గాడ్ ఆఫ్ వార్ చేయబోతున్నాడు. సో వీళ్లిద్దరి కాంబినేషన్ సెట్ అవ్వాలంటే కనీసం మూడు నాలుగేళ్లు పడుతుందేమో. ఫ్యాన్స్ మాత్రం ఈ కొత్త కాంబో కావాలనే అంటున్నారు.