Udaya Bhanu : ఆ హీరోయిన్ కి డబ్బింగ్ చెప్పా.. డైరెక్టర్ కనీసం నా పేరు కూడా వేయలేదు.. ఉదయభాను కామెంట్స్ వైరల్..
తాజాగా తను నిర్మించిన పంచనామా సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపింది. (Udaya Bhanu)
- Saketh U
- Published on- September 20, 2026 / 06:21 PM IST
Udaya Bhanu
Udaya Bhanu : వేరే భాషల హీరోయిన్స్ కి మన దగ్గర తెలుగు నటీమణులు, యాంకర్స్, సింగర్స్ చాలా మంది డబ్బింగ్ చెప్తారని తెలిసిందే. అలా ఓ హీరోయిన్ కి సీనియర్ యాంకర్ ఉదయభాను డబ్బింగ్ చెప్పిన విషయాన్ని బయటపెట్టింది. ఒకప్పుడు స్టార్ యాంకర్ గా ఉన్న ఉదయభాను, నటిగా కూడా కొన్ని సినిమాలు చేసి పెళ్లి, పిల్లలతో కెరీర్ గ్యాప్ తీసుకుంది.
ఉదయభాను ఇటీవలే రీ ఎంట్రీ ఇచ్చి ఓ పక్క నటిస్తూ మరో పక్క నిర్మాతగా కూడా సిరీస్ లు నిర్మిస్తుంది. తాజాగా తను నిర్మించిన పంచనామా సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపింది.
Also Read : Kayadu Lohar : ‘ది ప్యారడైజ్’ వచ్చేస్తుంది.. కానీ హీరోయిన్ కయదు లోహర్ ఎక్కడ?
ఉదయభాను మాట్లాడుతూ.. నేను ఛార్మికి శ్రీ ఆంజనేయం సినిమాకు డబ్బింగ్ చెప్పాను. ఛార్మి లాగే ఇమిటేట్ చేసి చెప్పాను. ఆమె పట్టి పట్టి మాట్లాడుతుంది. అలాగే వాయిస్ మార్చుకొని చెప్పాను. అందుకే ఆ సినిమాకు నేను డబ్బింగ్ అని ఎవరూ కనుక్కోలేదు. పైగా ఆ సినిమాకు డైరెక్టర్ డబ్బింగ్ కి నా పేరు కూడా వేయలేదు. అందుకే నేను డబ్బింగ్ చెప్పినట్టు బయటి వాళ్లకు తెలీదు. తర్వాత చాలా మంది అడిగారు డబ్బింగ్ కి. కానీ టైం వేస్ట్ అయ్యేది. నాలుగు ఐదు రోజులు చెప్పిస్తారు ఒక్కో క్యారెక్టర్ కి. అప్పుడు నాకు టైం లేదు, ఓపిక లేదు అందుకే డబ్బింగ్ ఆపేసాను అని తెలిపింది.
శ్రీ ఆంజనేయం సినిమా దర్శకుడు కృష్ణవంశీ. మరి డబ్బింగ్ క్రెడిట్స్ ఇవ్వలేదు అని ఉదయభాను చేసిన కామెంట్స్ పై కృష్ణవంశీ స్పందిస్తాడా చూడాలి.
Also Read : Vishwak Sen : మూడు నెలల్లో మూడు సినిమాలతో రాబోతున్న విశ్వక్.. వరుస ఫ్లాప్స్ కి చెక్ పెడతాడా?
