×
Ad

KH x RK Reunion : రజినీకాంత్ – కమల్ హాసన్ కలిసి సినిమా.. ప్రోమో వచ్చేసింది.. ఎవరు హీరో..

మీరు కూడా కమల్ - రజిని సినిమా ప్రోమో చూసేయండి.. (KH x RK Reunion)

  • Published On : February 21, 2026 / 12:27 PM IST

KH x RK Reunion

KH x RK Reunion : స్టార్ హీరోలు రజినీకాంత్ – కమల్ హాసన్ చాలా ఏళ్ళ తర్వాత కలిసి నటించబోతున్నారు. నేడు వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమాని అధికారికంగా ప్రకటించారు. రెడ్ జెయింట్ మూవీస్ నిర్మాణంలో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో అనిరుద్ సంగీత దర్శకత్వంలో ఈ సినిమాని ప్రకటించారు.

ఈ సినిమాని ప్రకటిస్తూ ఓ ప్రోమో కూడా రిలీజ్ చేసారు. ఈ ప్రోమోలో రజినీకాంత్ – కమల్ హాసన్ స్టైలిష్ గా రెడీ అయి వచ్చి ఓ కార్ లో కూర్చున్నట్టు చూపించారు. అదే కార్ లో నెల్సన్, అనిరుధ్ కూడా కూర్చోగా కమల్, రజినీకాంత్ ఇంతకీ సినిమాలో హీరో ఎవరు అని అడిగారు. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి కనిపించడంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది.

Also Read : Devi Sri Prasad : దేవిశ్రీ ప్రసాద్ హీరోగా 8 ఏళ్ళ క్రితమే సినిమా అనుకున్నారు.. ఆ సినిమా, డైరెక్టర్ గురించి తెలుసా?

టైటిల్ ప్రకటించలేదు కానీ ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి చేస్తుండటంతో సినిమాపై ఇప్పట్నుంచే అంచనాలు నెలకొన్నాయి. మీరు కూడా కమల్ – రజిని సినిమా ప్రోమో చూసేయండి..