‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’పై ప్రశంసల జల్లు..
- sekhar
- Updated on- July 31, 2020 / 03:41 PM IST
‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాతో టాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన యువ దర్శకుడు వెంకటేష్ మహా రూపొందించిన రెండో చిత్రం ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’. సత్యదేవ్, హరిచందన హీరో హీరోయిన్లుగా నటించారు. తాజాగా నెట్‌ఫ్లిక్స్ ద్వారా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు.
చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. సత్య ఇరగదీసాడు. నరేష్‌గారు, హీరోయిన్, ఇతర నటీనటులందరూ బాగా నటించారు. డైరెక్షన్, సంగీతం చాలా బాగున్నాయి. చిత్రబృందం మొత్తానికి ధన్యవాదాలు- దర్శకుడు పూరీ జగన్నాథ్.
ఇప్పుడే ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమా చూశాను. ‘కేరాఫ్ కంచరపాలెం’ దర్శకుడి నుంచి వచ్చిన మరో మంచి ఫీల్ ఉన్న సినిమా. సినిమాలో చాలా మంచి సన్నివేశాలున్నాయి. సంగీతం హృద్యంగా ఉంది- ఎమ్ఎమ్ కీరవాణి.
‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చాలా అందమైన సినిమా. అనుమతులు లభించిన తర్వాత థియేటర్లలో కూడా ఈ సినిమాను విడుదల చేయాలి. సినిమాలోని కొన్ని సన్నివేశాలను పెద్ద తెరపై కూడా చూడాలనుకుంటున్నా. డైరెక్టర్ వెంకటేష్ మహా నిజాయితీకి ధన్యవాదాలు. సత్యదేవ్‌కు పెద్ద అభిమానిని. సుహాస్ చాలా బాగా చేశాడు- నాని.
