amp domain was triggered too early. This is usually an indicator for some code in the plugin or theme running too early. Translations should be loaded at the init action or later. Please see Debugging in WordPress for more information. (This message was added in version 6.7.0.) in /var/www/html/10tv/wp-includes/functions.php on line 6122Unstoppable 2 Pawan Kalyan Episode Glimpse To Be Out Tomorrow
Unstoppable 2: నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్ 2’ టాక్ షో ఇప్పటికే నెంబర్ వన్ టాక్ షోగా గుర్తింపు పొందింది. ఈ టాక్ షోకు స్టార్స్ వరుసబెట్టి వస్తుండటంతో వ్యూవర్‌షిప్ కూడా భారీగా పెరిగినట్లుగా నిర్వాహకులు తెలిపారు. ఇక ఇటీవల ఈ టాక్ షోకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రావడంతో, ఏకంగా ఆహా యాప్ క్రాష్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి అన్‌స్టాపబుల్ టాక్ షో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారేందుకు రెడీ అవుతోంది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ టాక్ షోలో పాల్గొంటున్నట్లుగా నిర్వాహకులు ఇప్పటికే వెల్లడించారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్ కూడా ముగిసింది. దీంతో పవన్ పాల్గొన్న ఎపిసోడ్‌ను ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ చేస్తారా అని యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, సంక్రాంతి కానుకగా ఈ పవర్‌ఫుల్ ఎపిసోడ్‌కు సంబంధించి ఓ సర్‌ప్రైజ్ ఇవ్వనున్నట్లు ఆహా పేర్కొంది.
Unstoppable 2: పండగపూట పవన్ అన్‌స్టాపబుల్ షో.. నిజమైన పండగ అంటోన్న అభిమానులు!
పవన్ కల్యాణ్ ఎపిసోడ్‌కు సంబంధించిన వీడియో గ్లింప్స్‌ను రేపు(జనవరి 15) ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు ఆహా ప్రకటించింది. దీంతో పవన్ అభిమానులు ఆహా అంటున్నారు. ఇది కదా అసలైన పండగ ట్రీట్ అని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి పవన్ ఎపిసోడ్‌కు సంబంధించిన ఈ వీడియో గ్లింప్స్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Let the Sankranti celebrations begin early⚡️⭐️. The most anticipated glimpse of PSPK x NBK will be out at 11 AM tomorrow?#PawanKalyanOnAHA #PspkOnAHA #UnstoppableWithNBKS2 #NandamuriBalakrishna #NBKOnAHA@PawanKalyan pic.twitter.com/FeWwIrwlTi
— ahavideoin (@ahavideoIN) January 14, 2023