×
Ad

Urvashi Rautela : ఏపీ చీఫ్ మినిష్టర్ పవన్ కళ్యాణ్ అంటూ ఊర్వశి రౌతేలా ట్వీట్.. వైరల్ అవుతున్న ట్వీట్..

ఇవాళ సినిమా రిలీజ్ ఉండటంతో నిన్న నైట్ ఊర్వశి బ్రో సినిమా గురించి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్, తేజ్, ఊర్వశి కలిసి ఉన్న ఫోటోని తన ట్విట్టర్ లో షేర్ చేసి....

  • Published On : July 28, 2023 / 09:04 AM IST

Urvashi Rautela Tweet on Pawan Kalyan as Chief Minister of Andhrapradesh Tweet goes viral

Urvashi Rautela Tweet : ప‌వ‌న్ క‌ళ్యాణ్(Pawan kalyan), సాయిధ‌ర‌మ్‌ తేజ్(Sai Dharam Tej) క‌లిసి నటించిన ‘బ్రో'(Bro) సినిమా నేడు జులై 28న గ్రాండ్ గా రిలీజయింది. త‌మిళంలో మంచి విజ‌యం సాధించిన వినోద‌య సితం(Vinodaya Sitham) సినిమాకు ఇది రీమేక్‌గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో సముద్రఖని(Samuthirakani) ద‌ర్శ‌కత్వంలో తెరకెక్కింది. ఈ సినిమాలో ఊర్వశి రౌతేలా ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించింది.

ఇటీవల బ్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జగగా ఊర్వశి కూడా ఈ ఈవెంట్ కి హాజరైంది. ఇవాళ సినిమా రిలీజ్ ఉండటంతో నిన్న నైట్ ఊర్వశి బ్రో సినిమా గురించి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్, తేజ్, ఊర్వశి కలిసి ఉన్న ఫోటోని తన ట్విట్టర్ లో షేర్ చేసి.. బ్రో సినిమాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. సినిమా రేపు రిలీజవుతుంది. ఒక మనిషి చనిపోయాక లైఫ్ లో సెకండ్ ఛాన్స్ వస్తే అతని తప్పులు ఎలా సరిదిద్దుకున్నాడు అనే కథతో వస్తుంది అంటూ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ని ట్యాగ్ చేసింది.

పవన్ కళ్యాణ్ ని ఏపీ చీఫ్ మినిష్టర్ అంటూ ట్వీట్ చేయడంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ఇక ఈ ట్వీట్ కింద పవన్ ఫ్యాన్స్ సూపర్ అంటూ కానెంట్స్ చేస్తుండగా, జగన్ ఫ్యాన్స్ విమర్శలు చేస్తున్నారు. ఊర్వశి చేసిన ట్వీట్ ఇప్పుడు పవన్, జగన్ ఫ్యాన్స్ మధ్య ట్విట్టర్ లో వార్ జరిగేలా చేసింది. ఊర్వశి ట్వీట్ సోషల్ మీడియాలోనే కాకుండా ఏపీ రాజకీయాల్లో కూడా చర్చగా మారింది.

BRO Twitter Review : బ్రో సినిమా ట్విట్టర్ రివ్యూ.. పవన్ అన్ని సినిమాల రిఫరెన్స్‌లతో అదరగొట్టేశారంట..

ఒకవేళ తెలియక చేసింది అనుకున్నా ఇప్పటికే కింద చాలా మంది కామెంట్స్ చేశారు అయినా మార్చలేదు. ట్వీట్ నిన్న రాత్రి చేసినా ఇప్పటిదాకా కూడా మార్చకపోవడం గమనార్హం. దీంతో ఊర్వశి తెలిసే కావాలనే ఇలా ట్వీట్ చేసిందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.