Us Porn Star Dahlia Sky
US Porn Star Dahlia Sky : గతేడాది కాలంగా కొంతమంది సెలబ్రిటీలు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు చూస్తూ ఉన్నాం. తాజాగా యూఎస్ పోర్న్ స్టార్ డహ్లియా స్కై (31) ఆత్మహత్య చేసుకున్నారు. తన కారులో గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన జరిగి రెండు వారాలయినట్లు అధికారులు తెలిపారు.
జూన్ 30న శాన్ ఫెర్నాండో వ్యాలీలోని ఓ కారులో డహ్లియా నిర్జీవంగా పడి ఉండగా పోలీసులు కనుగొన్నారు. కారులోని దృశ్యాలు చూస్తే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాధమిక నిర్ధారణకు వచ్చిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Porn Star Dahlia Sky
మరో వైపు డహ్లియా స్టేజ్4 బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతున్నారని… ఆక్రమంలోనే డిప్రెషన్ తో ఆమె బలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చని ఆమె అభిమానులు భావిస్తున్నారు. 2010 లో బెయిలీ బ్లూ అనే సినిమాతో అడల్ట్ స్టార్ గా కేరీర్ ప్రారంభించిన డహ్లియాపదేళ్ళపాటు పోర్న్ స్టార్ గా రాణించింది. ఆమె మరణం అభిమానులను కలిచివేసింది.