Vaishnavi Chaitanya: ‘బేబీ’ క్యారెక్టర్‌ను మర్చిపోలేకపోతున్నారా.. రిపోర్టర్ ప్రశ్నతో వైష్ణవి అసహనం

ఎపిక్ టీజర్ రిలీజ్ ఈవెంట్ లో రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు అసహనం వ్యక్తం చేసిన వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya).

Vaishnavi Chaitanya faced regarding her image changeover

  • వైష్ణవికి ఎదురైన ఇమేజ్ మార్పు ప్రశ్న
  • అండగా నిలిచిన హీరో ఆనంద్ దేవరకొండ
  • పాత్రను బట్టి నటన ఉంటుందని స్పష్టత

Vaishnavi Chaitanya: ‘బేబీ’ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మళ్లీ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’. ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేదికపై చిత్ర విశేషాలను పంచుకుంటుండగా, ఓ విలేకరి అడిగిన ప్రశ్న వైష్ణవిని కాస్త ఇబ్బందికి గురిచేసింది. ‘బేబీ’లోని ఆమె పాత్ర ఇమేజ్‌ను మార్చుకోవాల్సిన అవసరం ఉందా అనే కోణంలో అడిగిన ప్రశ్నకు ఆమె వెంటనే స్పందించలేకపోయారు.

Rashi Singh: అందాల రాశిలా ‘రాశి సింగ్’ గ్లామర్.. మెరుస్తున్న అమ్మడు సోయగం.. ఫొటోలు

ఆ సమయంలో వైష్ణవి(Vaishnavi Chaitanya)కి అండగా నిలిచిన హీరో ఆనంద్ దేవరకొండ, దర్శకుడు ఆదిత్య హాసన్, ఆమె తరపున గట్టిగా సమాధానం ఇచ్చారు. సినిమాలోని కథాంశం, ఆ పాత్ర స్వభావాన్ని బట్టి నటన ఉంటుందని, కెరీర్ మొత్తం ఒకే విధమైన ఇమేజ్‌ను ఎవరూ కొనసాగించలేరని ఆనంద్ స్పష్టం చేశారు. ‘బేబీ’లో ఆమె అద్భుతమైన నటనకు అందరి ప్రశంసలు దక్కాయని, ఇప్పుడు ‘ఎపిక్’లో కూడా ఆమె ఎంతో బలమైన, లోతైన పాత్రను పోషిస్తోందని ఆయన వివరించారు.

సాధారణంగా చిత్ర పరిశ్రమలో బలమైన మహిళా పాత్రలు ఉన్న సినిమాలు ఏడాదికి ఒకటి లేదా రెండు మాత్రమే వస్తుంటాయని, అలాంటిది వైష్ణవికి కేవలం మూడేళ్ల వ్యవధిలోనే రెండు అద్భుతమైన అవకాశాలు రావడం గొప్ప విషయమని ఆనంద్ పేర్కొన్నారు. తన సహనటి పట్ల ఆనంద్ చూపించిన ఈ మద్దతుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో, ‘ఎపిక్’ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.