Vakeelsaab: ప్రకాశ్‌రాజ్, నేనూ సినిమాపరంగా మేమంతా ఒకటే
వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‍లో విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ లేకపోయినా ప్రస్తావన రావడంతో పవన్‌కల్యాణ్ ఆయన గురించి..
- Subhan Ali Shaik
- Updated on- April 5, 2021 / 10:44 AM IST
Vakeelsaab Pawan Kalyan Comments About Prakash Raj Acting
Vakeelsaab: వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‍లో విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ లేకపోయినా ప్రస్తావన రావడంతో పవన్‌కల్యాణ్ ఆయన గురించి కాసేపు మాట్లాడారు. రాజకీయంగా పవన్ పంథాను గట్టిగా వ్యతిరేకించే ప్రకాశ్‌రాజ్‌ను పొగడ్తలతో ముంచెత్తి తన అభిమానులను షాక్‌కు గురి చేశారు.
హైదరాబాద్‌లో వకీల్‌సాబ్ ఫ్రీ రిలీజ్ వేడుక ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా… ‘ ప్రతివాద లాయర్‌గా ప్రకాశ్‌రాజ్ నటించడం సినిమాకు వన్నె తెచ్చింది. బలమైన నటుడున్నాడంటే పర్‌ఫామెన్స్ బెటర్ అవుతుంది. ప్రకాశ్‌రాజ్‌ను తీసుకొచ్చిన దిల్‌రాజ్‌కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నా. అలాగే ప్రకాశ్‌రాజ్, నేను పొలిటికల్‌గా విభిన్నదారుల్లో ఉండొచ్చు. సినిమా పరంగా మేమంతా ఒకటే.
ఆ మధ్య చానల్స్‌లో నా గురించి ఏమైనా మాట్లాడితే నాకేమీ ఇబ్బంది అనిపించలేదు. అది ఆయన అభిప్రాయం. గౌరవిస్తాను. సినిమా పరంగా ప్రకాశ్‌రాజ్ నాకు ఇష్టమైన వ్యక్తి. ప్రకాశ్‌రాజ్ గొప్ప నటుడు. నిజంగా తెలుగు చిత్ర పరిశ్రమకి అలాంటి గొప్ప నటుడు ఉండడం మన అదృష్టం. అలాంటి గొప్ప నటుడితో నటించే అవకాశం వచ్చింది. సుస్వాగతం, జల్సా, బద్రి సినిమాల తర్వాత రావడం అదృష్టంగా భావిస్తున్నాను’ అని ప్రశంసలు కురిపించారు.
నిజానికి ఆ మధ్య బీజేపీతో మితృత్వం సాగిస్తున్న పవన్‌కల్యాణ్‌పై ప్రకాశ్‌రాజ్ ట్విటర్ వేదికగా ఘాటు విమర్శలు చేశారు. దానికి కౌంటర్‌గా మెగా బ్రదర్ నాగబాబు కూడా తనదైన స్టైల్‌లో రిప్లై ఇచ్చారు. ఇలా ఓ రేంజ్ లో ట్వీట్ తూటాలు పేల్చుకున్నారు.
