Varalaxmi SarathKumar
Varalaxmi SarathKumar : హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీగా ఉంది వరలక్ష్మి శరత్ కుమార్. ఇప్పుడు దర్శకురాలిగా కూడా మారింది. వరలక్ష్మి శరత్ కుమార్ మెయిన్ లీడ్ లో నటిస్తూ తెరకెక్కిస్తున్న సినిమా సరస్వతి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ ఈవెంట్ కి బన్నీ వాసు, డైరెక్టర్ గోపీచంద్ మలినేని గెస్టులుగా వచ్చారు. ఈ ఈవెంట్లో వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ ఎమోషనల్ అయింది.
వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ.. నేను ఎప్పుడూ ఫీమేల్ రైట్స్ కోసం నిలబడతాను అని అందరికి తెలుసు. ఇది కూడా అలాంటి సినిమానే. గోపీచంద్ మలినేని గారి వల్లే తెలుగులో నాకు మళ్ళీ లైఫ్ వచ్చింది. తెలుగు ఆడియన్స్ కి థ్యాంక్యూ. నాకు చాలా టెన్షన్స్ ఉన్నాయి. అందుకే ఎమోషనల్ అవుతున్నాను. ఇది రియల్ గా చాలా మంచి సినిమా. ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఈ సినిమాని చూడండి. ఇండస్ట్రీలో మహిళలు ఎదగడానికి హెల్ప్ చేయండి. సాధారణంగా నేను ఎమోషనల్ అవ్వను కానీ అయ్యాను. మహిళలు ఏడుపుని క్యారీ చేస్తారు. నేను ఇండస్ట్రీలో ప్రతి అమ్మాయి కోసం నిలబడటానికి ట్రై చేస్తాను. ఒక అమ్మాయిగా ఇండస్ట్రీలో ఉండటం కష్టం అంటూ స్టేజిపై ఎమోషనల్ అయింది.
Also Read : KH x RK Reunion : రజినీకాంత్ – కమల్ హాసన్ కలిసి సినిమా.. ప్రోమో వచ్చేసింది.. ఎవరు హీరో..