Sabari Song : తల్లీ కూతుళ్ళ ఎమోషనల్ సాంగ్ విన్నారా? వరలక్ష్మి ‘శబరి’ నుంచి సాంగ్ రిలీజ్..

తాజాగా శబరి సినిమా నుంచి 'నా చెయ్యి పట్టుకోవే చిన్నారి మైనా...' అనే తల్లీకూతుళ్ల ఎమోషనల్ సాంగ్ ని విడుదల చేశారు.

Varalaxmi Sarathkumar Sabari Movie Emotional Mother Daughter Song Released

Sabari Song : వరలక్ష్మీ శరత్ కుమార్(Varalaxmi Sarathkumar) మెయిన్ లీడ్ లో మహా మూవీస్ బ్యానర్ పై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మాణంలో అనిల్ కాట్జ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘శబరి’. ఇప్పటికే ఈ సినిమా నుంచి ట్రైలర్, టీజర్ రిలీజ్ చేసి శబరి సినిమా ఎమోషనల్ థ్రిల్లర్ గా ఉండబోతుందని తెలిపారు. ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.

తాజాగా శబరి సినిమా నుంచి ‘నా చెయ్యి పట్టుకోవే చిన్నారి మైనా…’ అనే తల్లీకూతుళ్ల ఎమోషనల్ సాంగ్ ని విడుదల చేశారు. ఈ పాటను కూడా తెలుగుతో పాటు మిగిలిన నాలుగు భాషల్లో కూడా రిలీజ్ చేశారు. ఈ పాటకి తెలుగులో రహమాన్ రాయగా గోపీసుందర్ సంగీత దర్శకత్వంలో అమృతా సురేష్ పాడారు. శబరి మ్యూజిక్ ఛానల్ లో ఈ పాటని విడుదల చేశారు. ఈ పాటని మీరు కూడా వినేయండి.

వరలక్ష్మీ శరత్ కుమార్, సినిమాలో ఆమె కుమార్తెగా నటించిన నివేక్ష మీద ఈ పాటను కొడైకెనాల్ లోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించారు. సాంగ్ రిలీజ్ సందర్భంగా నిర్మాత మహేంద్రనాథ్ మాట్లాడుతూ.. వరలక్ష్మి ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాగా ఈ శబరి రాబోతుంది. కూతురు కోసం తల్లి పడే తపన.. అనే ఎమోషనల్ పాయింట్ తో కొన్ని థ్రిల్లర్ అంశాలు జతచేసి ఈ సినిమాను తెరకెక్కించాం. పాన ఇండియా వైడ్ మే 3న భారీగా రిలీజ్ చేయబోతున్నాం అని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు