×
Ad

Varanasi : అక్కడ షూటింగ్ చేయబోయే మొదటి ఇండియన్ సినిమా.. ‘వారణాసి’తో సరికొత్త రికార్డ్..

తాజాగా వారణాసి సినిమా సరికొత్త రికార్డ్ సెట్ చేయనుంది. (Varanasi)

Varanasi

Varanasi : రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు వారణాసి సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో భారీగా తెరకెక్కుతుంది. దాదాపు 800 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 2027 ఏప్రిల్ 7 రిలీజ్ అవుతుందని ప్రకటించారు. ఇండియాతో పాటు కెన్యా, దక్షిణాఫ్రికా, టాంజానియా, జార్జియా.. ఇలా పలు దేశాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుంది.(Varanasi)

తాజాగా ఈ సినిమా సరికొత్త రికార్డ్ సెట్ చేయనుంది. రాజమౌళి మహేష్ బాబు వారణాసి సినిమా అంటార్కిటికాలో షూటింగ్ జరుపుకోనుందని సమాచారం. దీంతో అంటార్కిటిలో షూటింగ్ చేయబోయే మొదటి ఇండియన్ సినిమాగా వారణాసి సరికొత్త రికార్డ్ సెట్ చేయనుంది.

Also Read : Pawan Kalyan : మరో కొత్త సినిమా ఓకే చేసిన పవన్.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే ఫ్యాన్స్ షాక్ అవడం ఖాయం.. నిర్మాత కూడా సెట్టు..

ఆల్రెడీ రిలీజయిన వారణాసి గ్లింప్స్ లో.. అంటార్కిటికా లోని ప్రపంచములోనే అతి పెద్ద ఐస్ పర్వతం అయిన రాస్ షెల్ఫ్ ని చూపించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ కథకు అంటార్కిటికాకు కూడా సంబంధం ఉందని అర్ధమవుతుంది. ఈ నెలాఖరున లేదా మార్చ్ మొదటి వారం మూవీ టీమ్ అంటార్కిటికా వెళ్లనున్నట్టు, అక్కడ కొన్ని సీన్స్ షూటింగ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.

ఇప్పటివరకు అంటార్కిటికాలోది థింగ్, ఎయిట్ బిలో, ఎన్‌కౌంటర్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్, ది ఒడిసి, ఎర్త్ వన్ అమేజింగ్ డే, వైరస్, సౌత్ ఆఫ్ సానిటి, ది బ్లు వండర్.. ఇలా పలు హాలీవుడ్, జపాన్ సినిమాలను చిత్రీకరించారు. ఇప్పుడు మొదటిసారి వారణాసి ఇండియన్ సినిమాగా అంటార్కిటికాలో షూటింగ్ చేయబోతున్నారు. మరి అంత చలిలో, మంచులో మహేష్ – రాజమౌళి ఎలాంటి కష్టాలు పడి షూటింగ్ చేస్తారో, అక్కడ ఎలాంటి విజువల్స్ రాజమౌళి చూపించబోతున్నాడో చూడాలి.

Also Read : Priyanka Chopra : 3 నెలలు హాస్పిటల్‌లో.. ఆరు సార్లు రక్త మార్పిడి.. పాపం ప్రియాంక చోప్రా కూతురు.. నిక్ జోనస్ ఎమోషనల్..