Varanasi: బ్లాక్ ఫారెస్ట్‌లో మహేష్ బాబు.. ‘వారణాసి’ మూవీ క్రేజీ అప్డేట్
జర్మనీ బ్లాక్ ఫారెస్ట్ లో వారణాసి(Varanasi) మూవీ హీరో మహేష్ బాబు శిక్షణ
Varanasi movie hero Mahesh Babu in the Black Forest.
- మహేష్ రాజమౌళి భారీ గ్లోబల్ ప్రాజెక్ట్.
- జర్మనీ అడవుల్లో కఠినమైన శిక్షణ.
- అంటార్కిటికా షెడ్యూల్ కోసం ముందస్తు సన్నద్ధత.
Varanasi: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కలయికలో వస్తున్న ‘వారణాసి(Varanasi)’ చిత్రం ప్రస్తుతం సినీ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ షూటింగ్‌కు లభించిన విరామంలో మహేష్ బాబు జర్మనీలోని ప్రసిద్ధ ‘బ్లాక్ ఫారెస్ట్’ ప్రాంతానికి చేరుకున్నారు. ఇది కేవలం విహారయాత్ర మాత్రమే కాకుండా, సినిమాలోని కీలక ఘట్టాల కోసం జరుగుతున్న ముందస్తు కసరత్తుగా తెలుస్తోంది. ప్రకృతి ఒడిలో ట్రెక్కింగ్ చేస్తూ, తన బాడీని బిల్డ్ చేసుకునే పనిలో ఉన్నాడు మహేష్ బాబు. ఆ ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు.
Sravanthi Chokkarapu: చీరకట్టులో మతిపోయే అందం.. యాంకర్ స్రవంతి బ్యూటిఫుల్ ఫొటోలు
ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ హ్యారీ పర్యవేక్షణలో మహేష్ బాబు కఠినమైన శిక్షణ తీసుకుంటున్నారు. రాజమౌళి రూపొందిస్తున్న ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగనుండటంతో, రియాలిటీకి దగ్గరగా ఉండేందుకు మహేష్ ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. గతంలో కూడా ఇదే ప్రాంతంలో ఆయన శిక్షణ పొందడం విశేషం. సినిమాలో ఉండబోయే హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లకు తనను తాను సిద్ధం చేసుకోవడమే లక్ష్యంగా ఈ వెకేషన్ కొనసాగుతోంది.
ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌ను అంటార్కిటికాలో మొదలుకానుంది. అక్కడి అతి శీతల వాతావరణాన్ని తట్టుకుంటూ షూటింగ్లో పాల్గొనడం సవాలుతో కూడుకున్న పని కావడంతో, బాబు ముందస్తుగా తన ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టారు. అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది. మరి ఇన్ని ప్రత్యేకతల మధ్య తెరకెక్కుతున్న వారణాసి సినిమా విడుదల తరువాత ఎలాంటి సంచనాలు క్రియేట్ చేస్తుంది అనేది చూడాలి.
