Varanasi Postpone: ‘వారణాసి’ వాయిదా.. ప్రస్తుతానికి ఆ షెడ్యూల్ పక్కన పెట్టిన రాజమౌళి..?

ఇటీవలే హైదరాబాద్ లో వేసిన సెట్ లో ఉగ్రభట్టి గుహల ఎపిసోడ్ షూటింగ్ పూర్తయిందని సమాచారం. (Varanasi)

  • Updated on- May 29, 2026 / 03:48 PM IST

Varanasi Movie Shooting Schedule Postpone By Rajamouli

Varanasi : రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న వారాణసి సినిమాపై పాన్ వరల్డ్ హైప్ తెప్పించారు. ఒక్క టైటిల్ గ్లింప్స్ తోనే సినిమాపై ఆసక్తి నెలకొల్పారు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ భారీ సినిమా 2027 ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.

ప్రియాంక చోప్రా కూడా ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంది. ఇటీవలే హైదరాబాద్ లో వేసిన సెట్ లో ఉగ్రభట్టి గుహల ఎపిసోడ్ షూటింగ్ పూర్తయిందని సమాచారం. ఈ గుహల్లోనే చిన్నమస్తాదేవి ఉన్నట్టు వారణాసి టైటిల్ గ్లింప్స్ లో చూపించారు. ప్రస్తుతానికి ఆ సెట్ లో ఉండే సీన్స్ షూటింగ్ పూర్తయింది.

Also Read – Mareechika Review : ‘మరీచిక’ మూవీ రివ్యూ.. అనుపమ, రెజీనా కలిసి చేసిన సినిమా ఎలా ఉందంటే..

ఈ సినిమాలో అంటార్కిటికా ఎపిసోడ్ కూడా ఉండటంతో అంటార్కిటికాకు కూడా వెళ్లి షూటింగ్ చేయాలని ప్లాన్ చేసారు. సమ్మర్ మొదట్లోనే వెల్దామనుకున్నారు. ఇందుకోసం మహేష్ ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. కానీ ఏమైందో ఈ షెడ్యూల్ వాయిదా పడింది. అంటార్కిటికి అంత చల్లదనంలో సమ్మర్లో వెళ్లి షూటింగ్ చేద్దామని మే లో ప్లాన్ చేసారు రాజమౌళి.

కానీ ఈసారి కూడా అంటార్కిటికా షూటింగ్ షెడ్యూల్ వాయిదా వేసారట రాజమౌళి. ప్రస్తుతం అంటార్కిటికా షెడ్యూల్ పక్కన పెట్టి నెల రోజుల పాటు సాగే ఒక షూటింగ్ షెడ్యూల్, అందులో 2 యాక్షన్ ఎపిసోడ్స్ ప్లాన్ చేశారట రాజమౌళి. త్వరలోనే ఆ షెడ్యూల్ ప్రారంభం కానుందని సమాచారం. మరి వారణాసి మూవీ యూనిట్ అంటార్కిటికాకు ఎప్పుడు వెళ్తారో చూడాలి.