×
Ad

Varun Tej: చెల్లితో సినిమా చేస్తున్న వరుణ్ తేజ్.. డిజాస్టర్ డైరెక్టర్ కి ఛాన్స్.. అవసరమా అంటున్న ఫ్యాన్స్

ప్లాప్ డైరెక్టర్ తో సినిమా ఓకే చేసిన వరుణ్ తేజ్(Varun Tej).

varun tej doing his next movie with director vikram sirikonda

  • వరుణ్ తేజ్ తో సినిమా ప్లాన్ చేస్తున్న నిహారిక
  • దర్శకుడు విక్రమ్ సిరికొండ కథకు ఒకే చెప్పిన వరుణ్ తేజ్
  • త్వరలోనే అధికారిక ప్రకటన

Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చాలా కాలంగా హిట్స్ లేక సతమతమవుతున్నాడు. ఆయన చివరి హిట్ సినిమా గడ్డలకొండ గణేష్. ఈ సినిమా తరువాత వరుజ్ తేజ్ వరుసపెట్టి సినిమాలు చేస్తూ వచ్చాడు. కానీ, వాటిలో ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేదు. దీంతో, చాలా గ్యాప్ తీసుకున్న వరుణ్ తేజ్ దర్శకుడు మేర్లపాక గాంధీని లైన్లో పెట్టాడు. ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న మూవీ కొరియన్ కనకరాజు.

Balakrishna- Koratala: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. దేవర 2 కాదు.. బాలయ్యతో చేస్తున్నాడు

హారర్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే వరుణ్ తేజ్(Varun Tej) బర్త్ డే సందర్బంగా కొరియన్ కనకరాజు సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు మేకర్స్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్న ఈ టీజర్ ఆడియన్స్ కి ఫుల్లుగా నచ్చేసింది. అలాగే, సినిమాపై అంచనాలను కూడా పెంచేసింది. అయితే, ఈ సినిమా తరువాత కూడా చాలా ఆలోచించి సినిమాలు చేస్తున్నాడు వరుణ్ తేజ్.

ఈ నేపధ్యంలోనే తన చెల్లి నిహారికతో ఒక సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట. అవును, నిహారిక నిర్మాతగా ఉన్న విషయం తెలిసిందే. కమిటీ కుర్రోళ్ళు సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది నిహారిక. ఇక ఇప్పుడు అన్నతో సినిమా చేయాలనీ ఫిక్స్ అయ్యిందట. ఈ సినిమాను దర్శకుడు విక్రమ్ సిరికొండ తెరకెక్కిస్తాడని తెలుస్తోంది. విక్రమ్ సిరికొండ గతంలో రవి తేజతో టచ్ చేసి చూడు అనే సినిమా చేశాడు. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు చాలా కాలం తరువాత వరుణ్ తేజ్ తో సినిమా చేస్తున్నాడు. మరి నిహారిక తన అన్నతో చేస్తున్న సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది అనేది చూడాలి.