Korean Kanakaraju First Review : ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. ఈసారైనా వరుణ్ తేజ్ హిట్ కొడతాడా..?
ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. ఇండస్ట్రీలో పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ సినిమా చూశారు. (Korean Kanakaraju First Review)
Korean Kanakaraju First Review
Korean Kanakaraju First Review : వరుణ్ తేజ్, రితిక నాయక్ జంటగా యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కొరియన్ కనకరాజు. ఆగస్టు 7న ఈ సినిమా రిలీజ్ అవుతుండగా ముందు రోజు అంటే నేడు ఆగస్ట్ 6 సాయంత్రం నుంచే ప్రీమియర్స్ వేస్తామని ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. ఇండస్ట్రీలో పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ సినిమా చూశారు. దీంతో సెన్సార్, టాలీవుడ్ రివ్యూ బయటకు వచ్చింది.
కథ విషయానికొస్తే.. రాయలసీమ పెనుగొండలో ఉన్న కనకరాజుకి కోపం ఎక్కువ. అతను ఫ్రెండ్(సత్య)తో కలిసి తిరుగుతూ ఉంటాడు. అక్కడే ఉన్న కియా కార్ల కంపెనీలో పనిచేసే అమ్మాయి(రితిక నాయక్)ని చూసి ఇష్టపడతాడు. ఆమెకు ఏమో కొరియా అంటే ఇష్టం, కొరియన్ సినిమాలు చూస్తూ, కొరియన్ మాట్లాడుతూ, కొరియా వెళ్ళాలి అనుకుంటూ ఉంటుంది. కియా కంపెనీలో అనేకమంది కొరియా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అనుకోకుండా కొరియాకు చెందిన ఓ గ్యాంగ్ స్టర్ ఆత్మ ఉన్న సీసా పెనుగొండకు వస్తుంది. అది బయటకు వచ్చి కనకరాజు శరీరంలోకి వెళ్తుంది. కనకరాజు శరీరం వాడుకొని, రితిక, సత్యలతో కలిసి కొరియా వెళ్లి తనను చంపిన వాళ్ళను చంపాలని, రివెంజ్ తీర్చుకోవాలని ఆ ఆత్మ చూస్తుంది. ఈ నేపథ్యంలో ఎదురయ్యే హారర్, కామెడీ, యాక్షన్ సన్నివేశాలతో ఈ కొరియన్ కనకరాజు సాగనుందట.
Also Read : Thaman : తమన్ కమెడియన్ గా నటించిన సినిమా.. ఇప్పుడు ఓటీటీలో.. అస్సలు మిస్ అవ్వొద్దు..
విశ్లేషణ.. సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ బోర్డు. రెండు గంటల 36 నిమిషాల నిడివితో ఈ సినిమా ఉండనుంది. మొదటి అరగంట మాత్రం హీరో, హీరోయిన్స్ పాత్రలు ఎస్టాబ్లిష్ చేయడానికి, ఓ ఎంట్రీ సాంగ్ కి రొటీన్ గా సాగదీసినట్టు ఉంటుందట. హీరోయిన్ లవ్ ట్రాక్ కొరియాతో లింక్ చేస్తూ కొత్తగా ఉండనుందట. ఇక ఆత్మ ఎంట్రీ ఇచ్చిన దగ్గర్నుంచి హారర్ కామెడీతో ఆసక్తిగా సాగుతుంది. ఇంటర్వెల్ కి కొరియాకు వెళ్లడానికి సిద్ధం అవ్వడంతో సెకండ్ హాఫ్ లో కొరియాలో ఏం జరిగింది అనే ఆసక్తి నెలకొంటుంది.
సెకండ్ హాఫ్ లో ఆ కొరియన్ ఆత్మ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ, ఆ ఆత్మ రివేంజ్, కనకరాజుకు తన బాడీలో ఆత్మ ఉందని తెలిసి దాంతో ఫైటింగ్.. అని యాక్షన్ గా సాగనుందట. మొదటి అరగంట తప్పితే సినిమా అంతా ఆసక్తిగా నడుస్తుంది. సత్య – వరుణ్ తేజ్ సీన్స్ అయితే హిలేరియస్ గా నవ్వించబోతున్నాయట. ఇక తమన్ అయితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టాడు. కానీ OG సినిమాకు మిగిలిన కొన్ని బ్యాక్ గ్రౌండ్ ట్యూన్స్ ఇందులో వాడినట్టు సమాచారం. పాటలు మాత్రం యావరేజ్. కొరియా – ఇండియా కల్చర్ బాగా చూపించారట. ఆత్మ రావడం హారర్, కామెడీ, ఆత్మకు రివేంజ్ ఉండటం కొత్త కథేం కాకపోయినా కొరియన్ బ్యాక్ డ్రాప్ తీసుకొని సరికొత్త స్క్రీన్ ప్లే తో మేర్లపాక గాంధీ మ్యాజిక్ చేసాడంట. సినిమాటోగ్రఫీ విజువల్స్ కూడా డార్క్ కలర్ ప్యాలెట్ తో అదిరిపోయాయి.
Also See : Sandhya Vasishta : అనకాపల్లి ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీరకట్టులో సందడి చేసిన సంధ్య వశిష్ఠ..
వరుణ్ తేజ్ మాత్రం రాయలసీమ కుర్రాడిగా, కొరియన్ గ్యాంగ్ స్టార్ గా స్టైలిష్ అవతారంలో రెండు వేరియేషన్స్ లో అదరగొట్టాడు అని తెలుస్తుంది. వరుసగా గాండీవధరి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్, మట్కా సినిమాలతో ఫ్లాప్స్ చూసిన వరుణ్ తేజ్ ఈ సినిమాతో హిట్ కొట్టబోతున్నాడని అంటున్నారు. ఇన్నాళ్లు సింపుల్ పాత్రల్లో మెప్పించిన రితిక నాయక్ మొదటిసారి కమర్షియల్ హీరోయిన్ గా కొత్తగా కనిపించిందట. సత్య అయితే హిలేరియస్ గా నవ్వించి ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాడు.
