×
Ad

Varun Tej : వరుణ్ తేజ్ ఫోన్‌లో లావణ్య పేరు ఏమని సేవ్ చేసి ఉంటుందో తెలుసా..?

వరుణ్ తేజ్ ఫోన్‌లో లావణ్య పేరు ఏమని సేవ్ అయ్యి ఉంటుందో తెలుసా..? తాజాగా ఈ విషయాన్ని వరుణ్ అందరికి తెలియజేశాడు.

  • Published On : August 23, 2023 / 04:18 PM IST

Varun Tej saved Lavanya Tripathi name as LavN in his contact list

Varun Tej – Lavanya Tripathi : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జూన్ 9న ఎంగేజ్మెంట్ జరుపుకొని తమ ప్రేమ విషయాన్ని అందరికి తెలియజేశారు. దాదాపు 5 ఏళ్ళ పాటు రహస్య ప్రేమాయణం నడిపిన వీరిద్దరూ త్వరలో ఏడడుగులు వేసి పెళ్లి బంధాన్ని మొదలుపెట్టబోతున్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ ‘గాండీవధారి అర్జున’ (Gandeevadhari Arjuna) మూవీ ప్రమోషన్స్ సందడి చేస్తున్నాడు. ఈక్రమంలోనే తాజాగా ఒక ప్రముఖ టీవీ షోలో పాల్గొన్నాడు.

Akira Nandan : పవన్ తనయుడు అకీరా.. హీరోగా కాదు మ్యూజిక్ డైరెక్టర్‌గా.. అందుకే ఫిలిం స్కూల్‌లో.. రేణూదేశాయ్ పోస్ట్!

ఈ షోలో వరుణ్ కి ఒక సరదా ప్రశ్న ఎదురైంది. తన ఫోన్ లో లావణ్య పేరుని ఎలా సేవ్ చేసుకున్నాడు అని ప్రశ్నించగా, వరుణ్ బదులిస్తూ.. “LavN అని సేవ్ చేసి ఉంటుంది” అని తెలియజేశాడు. లావణ్యనే తన ఫోన్ తీసుకోని అలా సేవ్ చేసిందని కూడా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా వీరిద్దరి పెళ్లి తేదీ కోసం ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. గాండీవధారి అర్జున మూవీ ప్రమోషన్, రిలీజ్ హడావుడి పూర్తి అయ్యిన తరువాతే పెళ్లి డేట్ అండ్ ప్లేస్ పై నిర్ణయం తీసుకుంటామంటూ వరుణ్ తెలియజేశాడు.

Naveen Polishetty : సెట్స్ లోకి రాగానే అనుష్క అందరికి ఒక వెచ్చటి హాగ్ ఇస్తుంది.. నవీన్ పోలిశెట్టి కామెంట్స్..

ఇక పెళ్లిని డెస్టినేషన్ వెడ్డింగ్ రూపంలో చేసుకోబోతున్నట్లు, పెళ్లి వేదికకు కోసం ఇండియాలో అండ్ ఫారిన్ లో కొన్ని ప్లేస్ లు పరిశీలనలో ఉన్నాయట. త్వరలోనే వీటన్నిటి పై ఒక క్లారిటీ ఇవ్వనున్నట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రకటించాడు. కాగా వరుణ్, లావణ్య ‘మిస్టర్’, ‘అంతరిక్షం’ సినిమాల్లో కలిసి నటించారు. ఈ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ మొదలైనట్లు, ముందుగా వరుణే ప్రపోజ్ చేసినట్లు కూడా ఇటీవల వెల్లడించాడు. అయితే ఈ ప్రేమ విషయాన్ని మాత్రం ఎంగేజ్మెంట్ వరకు రహస్యంగానే ఉంచుతూ వచ్చాడు.