Vedha Jalandhar : తిమ్మరాజుపల్లి టీవీ హిట్ తర్వాత అమీర్ లోగ్ అంటూ వస్తున్న హీరోయిన్..

నటి వేధా జలంధర్ మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపింది.(Vedha Jalandhar)

  • Published on- August 20, 2026 / 07:53 AM IST

Vedha Jalandhar

Vedha Jalandhar : ఇటీవల తిమ్మరాజు పల్లి టీవీ సినిమాతో హిట్ కొట్టిన వేద జలంధర్ ఇప్పుడు అమీర్ లోగ్ సినిమాతో రాబోతుంది. అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పి బ్యానర్ పై మాధవి రెడ్డి సోమ నిర్మాణంలో రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అమీర్‌ లోగ్’. ఎంసీ హరి, మనోజ్, శశిధర్ హీరోలుగా నటించగా వేద జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయియోగి.. పలువురు కీలక పాత్రలు పోషించారు. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ యూత్, ఫ్రెండ్షిప్ కథతో ఈ సినిమా రాబోతుంది. రానా దగ్గుబాటి సంస్థ స్పిరిట్ మీడియా ఈ సినిమాని ఆగస్ట్ 21న థియేటర్స్ లో రిలీజ్ చేస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నటి వేధా జలంధర్ మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపింది.

Also Read : Modern Missamma : ‘మోడ్రన్ మిస్మమ్మ’ నుంచి ఈ సాంగ్ విన్నారా.. అమ్మాయిలు మీ కోసమే..

తన జర్నీ గురించి మాట్లాడుతూ.. 2019లోనే కెరీర్ ప్రారంభించాను. నేను చేసిన ఓ రెండు సినిమాలు ఫిల్మ్ ఫెస్టివల్‌కు వెళ్లాయి కానీ రిలీజ్ కాలేదు. ఆ తర్వాత యాక్టింగ్ కోసం థియేటర్ కూడా నేర్చుకున్నాను. అప్పుడే నాకు తిమ్మరాజుపల్లి టీవీ అవకాశం వచ్చింది. ఆ సినిమా రిలీజ్ అయి హిట్ అవ్వడంతో మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమా చేసినట్టు మా దర్శకుడు రమణ గారికి తెలీదు. ఈ సినిమా ఆడిషన్‌కి వెళ్లి సెలెక్ట్ అయ్యాను. ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి అనేకంటే మనల్ని ఆడియెన్స్ ఎంతలా యాక్సెప్ట్ చేశారు, ఎలాంటి పాత్రల్ని ఎంచుకుంటున్నాం అనేదే ముఖ్యం అని నేను భావిస్తాను. మనం చేసిన వాటిలో ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతాయో మన చేతుల్లో ఉండదు అని తెలిపింది.

అమీర్ లోగ్ సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాలో నా పాత్ర పక్కింటి అమ్మాయిలా, మహిళలకు స్పూర్తినిచ్చేలా ఉంటుంది. మా అమ్మే నాకు స్పూర్తి. ఈ సినిమాలో పాత్ర కూడా అలానే ఉంటుంది. ఈ సినిమాలో అందరి పాత్రలకు ఇంపార్టెన్స్ ఉంది. ముఖ్యంగా మహిళల పాత్రలకు. సినిమా అంతా హైదరాబాద్ బస్తీలలో షూట్ చేసాము. అక్కడ మమ్మల్ని వాళ్ళు బాగా చూసుకున్నారు. ఈ సినిమా సింక్ సౌండ్ లో చేసాము. సింక్ సౌండ్‌ కి మనం ఎంత ప్రొఫెషనల్‌గా ఉన్నా చుట్టు పక్కల ఉన్న సౌండ్స్ కూడా రికార్డ్ అవుతుంటాయి. సెట్‌లో చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ ఈ సినిమాకు బస్తీ వాళ్లు మాకు ఎంతో సపోర్ట్ చేశారు. మేం డెమో షూట్ కూడా చేసాము. దర్శకుడు ముందే మాకు ప్రతీ సీన్ వివరించారు అని తెలిపారు.

Also See : Vedha Jalandhar : లాంగ్ ఫ్రాక్‌లో వేద జలంధర్ వయ్యారాలు.. సినిమా ప్రమోషన్స్ లో..

అలాగే.. అమీర్ లోగ్‌ సినిమా చూసిన వాళ్లంతా నా పాత్ర గురించి మాట్లాడుకుంటారు. మా సినిమాని స్పిరిట్ టీం చూసి అభినందించింది. అందుకే వాళ్ళే రిలీజ్ చేస్తున్నారు. మా ప్రీమియర్ చూసిన డైరెక్టర్ వీఎన్ ఆదిత్య గారు కూడా చాలా మెచ్చుకున్నారు. రమణ గారి రైటింగ్, మా పర్ఫామెన్స్‌కి సింక్ అయిందని చెప్పినట్లు తెలిపారు వేద జలంధర్.