Anil- Venkatesh: మొన్న చిరంజీవి.. ఇప్పుడు వెంకటేష్.. పెళ్ళైన హీరోయిన్స్ నే ఫిక్స్ చేస్తున్న అనిల్

తన నెక్స్ట్ సినిమాలో వెంకటేష్ కు జోడీగా పెళ్ళైన హీరోయిన్ ని తీసుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి(Anil- Venkatesh).

Venkatesh and anil ravipudi next movie heroine update

  • అనిల్-వెంకటేష్- కళ్యాణ్ రామ్ కాంబోలో క్రేజీ మల్టీ స్టారర్
  • ఈ సినిమాలో వెంకటేష్ కు జోడీగా కీర్తి సురేష్
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్

Anil- Venkatesh: ప్రస్తుతం టాలీవుడ్ లో సంక్రాంతి సీజన్ అంటే గుర్తొచ్చే ఏకైక దర్శకుడు అంటే అనిల్ రావిపూడి అనే చెప్పాలి. ప్రతీ సంక్రాంతికి ఒక సినిమాతో రావడం బ్లాక్ బస్టర్ సాధించడం ఈ డైరెక్టర్ కి అలవాటుగా మారిపోయింది. ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్, ఈ ఏడాది ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రంతో ఏకంగా ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు.

అదే ఊపును కొనసాగిస్తూ, వచ్చే ఏడాది కూడా తన మార్క్ వినోదాన్ని పంచేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఒక భారీ మల్టీస్టారర్ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తూ ఫ్యాన్స్‌లో అంచనాలను పెంచేశారు. విక్టరీ వెంకటేష్(Anil- Venkatesh), నందమూరి కల్యాణ్ రామ్ కాంబినేషన్‌లో ఈ క్రేజీ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడటంతో, అనిల్ రావిపూడి ప్రస్తుతం తన టీమ్‌తో కలిసి స్క్రిప్ట్ వర్క్‌ను శరవేగంగా పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. తన గత చిత్రాల తరహాలోనే ఇందులోనూ కడుపుబ్బ నవ్వించే వినోదంతో పాటు, బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్, పవర్ ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Sreemukhi: ఓరచూపుతో వలపు వల.. శ్రీముఖి అందాలు కెవ్వు కేక.. ఫోటోలు

త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ కూడా మొదలుకానుంది. ఈ నేపధ్యంలోనే, ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్ల గురించి ఒక క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే, మన శంకర వార ప్రసాద్ గారు సినిమాలో చిరంజీవికి హీరోయిన్ గా పెళ్ళైన నయనతారను తీసుకున్న అనిల్ రావిపూడి.. ఇప్పుడు వెంకటేష్ కోసం కూడా రీసెంట్ గా పెళ్ళైన స్టార్ బ్యూటీని హీరోయిన్ గా తీసుకుంటున్నాడట. ఈ సినిమాలో వెంకటేష్ సరసన కథానాయికగా ‘మహానటి’ కీర్తి సురేష్ దాదాపు ఖరారైనట్లు సమాచారం.

గతేడాది ఆంటోనీ తట్టిల్‌ను వివాహం చేసుకున్న కీర్తి, పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో జోరు చూపిస్తున్నారు. వెంకటేష్ – కీర్తి సురేష్ లది సరికొత్త జోడీ కావడంతో ప్రేక్షకులకు ఇది ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. మరోవైపు, నందమూరి కల్యాణ్ రామ్ సరసన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టిని తీసుకోవాలని చేసుతున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే, వరుస ప్లాపులతో ఇబ్బంది పడుతున్న కృతికి ఇది బంపర్ ఆఫర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, ఈ న్యూస్ పై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.