Vikram: స్వాతిముత్యం కోసం వస్తున్న స్వర్ణకమలం!
తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ విక్రమ్ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే. చాలా రోజుల తరువాత కమల్...
- Anil Aaleti
- Published on- May 30, 2022 / 03:06 PM IST
Venkatesh To Grace Vikram Pre Release Event
Vikram: తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ విక్రమ్ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే. చాలా రోజుల తరువాత కమల్ నుండి వస్తున్న ఔట్ అండ్ ఔట్ యాక్షన్ మూవీ కావడంతో ‘విక్రమ్’ సినిమాపై తమిళంలోనే కాకుండా తెలుగులోనూ భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇక ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్‌కు ఇప్పటికే తెలుగునాట కూడా మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. తాజాగా ఈ చిత్రాన్ని తెలుగులో ప్రమోట్ చేసేందుకు విక్రమ్ యూనిట్, ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించేందుకు రెడీ అయ్యింది.
Vikram: తెలుగులోనూ ‘విక్రమ్’ గ్రాండ్ రిలీజ్
అయితే విక్రమ్ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విక్టరి వెంకటేష్ రాబోతున్నట్లు విక్రమ్ యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాను సెన్సేషనల్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తుండటంతో విక్రమ్ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఆయన తెరకెక్కించిన లాస్ట్ మూవీ ‘మాస్టర్’ ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో విక్రమ్ సినిమాతో కమల్ కూడా చాలా రోజుల తరువాత అదిరిపోయే సక్సెస్ అందుకోవడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇక ఈ సినిమాలో కమల్ హాసన్‌తో పాటు విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, తమిళ స్టార్ యాక్టర్ సూర్య ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
Vikram: విక్రమ్ సెన్సార్ రిపోర్ట్.. రన్‌టైమ్ ఎంతంటే?
ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను మే 31న హైదరాబాద్‌లోని శిల్ప కళావేదికలో సాయంత్రం 6 గంటల నుండి నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సినిమాను రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ ప్రొడ్యూస్ చేస్తుండగా, తెలుగు యంగ్ హీరో నితిన్ హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ ఈ సినిమాను తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. జూన్ 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న విక్రమ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
