Aadarsha Kutumbam : మాస్ బీట్ సాంగ్ పాడబోతున్న వెంకీ!
ఫ్యామిలీ ఓరియంటేడెట్ మూవీస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విక్టరీ వెంకటేష్ (Aadarsha Kutumbam) అప్పుడప్పుడు తన సినిమాల్లో చిన్న సాంగ్స్ పాడుతూ వాయిస్ అందిస్తూ వస్తున్నాడు
- Thota Vamshi Kumar
- Published on- April 24, 2026 / 01:51 PM IST
Venky to sing mass beat song in Aadarsha Kutumbam
Aadarsha Kutumbam : ఫ్యామిలీ ఓరియంటేడెట్ మూవీస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విక్టరీ వెంకటేష్ అప్పుడప్పుడు తన సినిమాల్లో చిన్న సాంగ్స్ పాడుతూ వాయిస్ అందిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు మరోసారి వెంకటేష్ సింగర్‌గా మారబోతున్నాడని టాక్. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం మూవీలో వెంకీ ఒక మాస్ బీట్ సాంగ్‌ను తన స్టైల్‌లో పాడబోతున్నాడని అంటున్నారు.
ఇప్పటికే కొన్ని సినిమాల్లో సరదాగా తన వాయిస్‌తో అభిమానులను ఆకట్టుకున్న వెంకటేష్, ఈసారి పూర్తిస్థాయి మాస్ సాంగ్‌తో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడని ప్రచారం నడుస్తోంది. వెంకటేష్ పాడబోయే సాంగ్ కోసం సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ స్పెషల్‌గా ఓ క్యాచీ ట్యూన్ కంపోజ్ చేశాడని టాక్.
వెంకీ వాయిస్‌కు సూట్ అయ్యేలా మాస్ బీట్‌తో పాటు ఫన్ ఎలిమెంట్స్ కలిపి ట్యూన్ రెడీ చేసినట్టు చెబుతున్నారు. త్రివిక్రమ్ స్టైల్ డైలాగ్ మేనరిజం, వెంకటేష్ ఎనర్జీ, హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ కలిస్తే ఈ పాట సినిమాకే హైలైట్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. అయితే వెంకీ సాంగ్ పాడబోతున్నాడా లేదా అన్నది మూవీ టీమ్ క్లారిటీ ఇవ్వలేదు. అధికారిక ప్రకటన వస్తే మాత్రం నెక్స్ట్ లెవల్ హైప్ క్రియేట్ కానుంది.
