NTR : ఎన్టీఆర్ కి అప్పటివరకు రాజకీయాల్లోకి రావొద్దని చెప్పాను.. వేణుస్వామి కామెంట్స్ వైరల్..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో వేణుస్వామి మాట్లాడుతూ.. (NTR)
- Saketh U
- Published on- August 18, 2026 / 07:13 PM IST
NTR
NTR : సెలబ్రిటీలతో పూజలు చేయిస్తూ, సెలబ్రిటీల జాతకాలు చెప్తూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు వేణుస్వామి. పలు విమర్శలు వచ్చినా ఆయన సెలబ్రిటీల జాతకాలు చెప్పడం మాత్రం మానలేదు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ జాతకం చెప్పుకొచ్చారు. గతంలోనే ఎన్టీఆర్ సీఎం అవుతారు అని వ్యాఖ్యలు చేసి వైరల్ అయ్యారు వేణుస్వామి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో వేణుస్వామి మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్ అసలు పుట్టిన రోజు వేరు. మీ అందరికి తెలిసిన, ఆయన చేసుకునే పుట్టినరోజు వేరు. ఆయన అసలు పుట్టినరోజు డేట్ నాకు తెలుసు. ఎన్టీఆర్ కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారు. కానీ ఆయనకు ఇప్పట్లో రాజకీయ ప్రవేశం లేదు. 2030 వరకు ఎన్టీఆర్ ని రాజకీయాల్లోకి రావొద్దని నేనే చెప్పాను. ఓ సారి తిరుమలలో జూనియర్ ఎన్టీఆర్, వాళ్ల అమ్మగార్ని నేను కలిశాను. అప్పుడు నేనే స్వయంగా 2030 వరకు రాజకీయాల్లోకి రావొద్దని చెప్పాను. ఎన్టీఆర్ ది జయలలిత జాతకం. ఆయన భవిష్యత్తులో సీఎం అవుతారు అని అన్నారు.
Also Read : Megastar Chiranjeevi : ఏమున్నాడ్రా బాబు.. మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోషూట్.. 70 ఏళ్ళ వయసులో కూడా తగ్గేదేలే..
దీంతో వేణుస్వామి కామెంట్స్ వైరల్ గా మారాయి. గత కొన్నాళ్లుగా ఎన్టీఆర్ సీఎం సీఎం అని ఫ్యాన్స్ అరుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వేణుస్వామి ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అవుతారు అని చెప్పడంతో ఆయన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ చేతికి సర్జరీ చేయించుకొని రెస్ట్ తీసుకుంటున్నారు. ఆయనకు ఆపరేషన్ జరగడంతో డ్రాగన్ షూట్ వాయిదా పడింది.
