Ramani Kalyanam Teaser: యూత్ ఫుల్ కంటెంట్ తో ‘రమణి కళ్యాణం’.. టీజర్ విడుదల చేసిన నటి జయసుధ
సహజ నటి జయసుధ చేతులమీదుగా విడుదలైన ‘రమణి కళ్యాణం(Ramani Kalyanam Teaser)’ మూవీ టీజర్.
- V Santhosh Kumar
- Published on- May 12, 2026 / 07:20 PM IST
veteran actress Jayasudha released Ramani Kalyanam movie teaser
- జయసుధ చేతులమీదుగా ‘రమణి కళ్యాణం’ టీజర్
- లవ్ అండ్ ఎమోషనల్ కంటెంట్ తో మూవీ
- మే 22న గ్రాండ్ రిలీజ్.
Ramani Kalyanam Teaser; విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో సూర్య వశిష్ట, దీప్షిక హీరో హీరోయిన్లుగా రూపొందిన హృద్యమైన చిత్రం ‘రమణి కళ్యాణం(Ramani Kalyanam Teaser)’. కైట్స్ క్రియేటివ్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ సినిమా టీజర్‌ను సహజనటి జయసుధ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నటీనటుల సహజ సిద్ధమైన నటన, అద్భుతమైన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలాలు అని కొనియాడారు. చిన్న సినిమాల్లో కూడా గొప్ప కంటెంట్ వస్తోందని, మే 22న విడుదల కానున్న ఈ ఫీల్ గుడ్ మూవీని ప్రేక్షకులందరూ థియేటర్లలో చూడాలని ఆమె కోరారు.
Chiranjeevi: మెగాస్టార్ స్టైలీష్ మేకోవర్.. క్రేజీ లుక్ లో అదరగొడుతున్న చిరు.. ఫొటోలు
హీరో సూర్య వశిష్ట ఈ సినిమాలో వీల్ చైర్‌కే పరిమితమైన యువకుడిగా ఒక క్లిష్టమైన పాత్రను పోషించగా, హీరోయిన్ దీప్షిక అంధురాలిగా ఛాలెంజింగ్ రోల్‌లో నటించింది. తమ పాత్రలు ప్రేక్షకులకు ఒక కొత్త ఆశను, సానుకూల శక్తిని అందిస్తాయని వారు ధీమా వ్యక్తం చేశారు. షూటింగ్ సమయంలో తాము పడిన కష్టం, కథలోని లోతు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయని, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ క్లీన్ మూవీ ఒక మంచి అనుభూతిని ఇస్తుందని నటీనటులు పేర్కొన్నారు.
దర్శకుడు విజయ్ ఆదిరెడ్డి తన టీమ్ సపోర్ట్‌తో ప్యాషన్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. రామ్ జగదీష్ అందించిన డైలాగ్స్ సినిమాకు ప్రాణం పోశాయని, థియేటర్లలో సినిమా చూసినప్పుడే ఆ అనుభూతి కలుగుతుందని ఆయన తెలిపారు. నిర్మాతలు శ్రీనాథ్ పసుపులేటి, మనోజ్ చింతిరెడ్డి, సంజయ్ వెంపరాల ఈ సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. జయసుధ గారి ప్రశంసలు తమ చిత్రానికి కొండంత బలాన్ని ఇచ్చాయని, మే 22న ఈ సినిమా విడుదలవుతోందని చిత్ర బృందం ప్రకటించింది.
