Salman Khan : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ బర్త్ డే ఈరోజు కావడంతో బి-టౌన్లో సెలెబ్రేషన్స్ మొదలయ్యాయి. అభిమానులతో పాటు సినీ పరిశ్రమ నుంచి కూడా సల్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెతుతున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ విక్టరీ వెంకటేష్ కూడా బర్త్ డే విషెస్ తెలియజేశాడు. వెంకటేష్ అండ్ సల్మాన్ డిఫరెంట్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్న, వీరిద్దరూ ఎప్పటినుంచో మంచి మిత్రులుగా ఉంటూ వస్తున్నారు.
Venkatesh: హిట్ డైరెక్టర్‌తో వెంకీ మూవీ.. నిజమేనా?
ఈ స్నేహంతోనే సల్మాన్ ఖాన్ వెంకటేష్ భుజంపై తల వాల్చి ఉన్న ఒక ఫోటోని వెంకటేష్ షేర్ చేస్తూ.. ‘హ్యాపీ బర్త్ డే మై డియర్ సల్మాన్ ఖాన్’ అంటూ విషెస్ తెలియజేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారు. ‘కిసికా భాయ్ కిసికి జాన్’ అనే టైటిల్ ని పెట్టుకున్న ఈ సినిమా పవన్ కళ్యాణ్ కాటమరాయుడుకి రీమేక్ గా తెరకెక్కుతుంది.
ఈ సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ బుట్టబొమ్మ పూజ హెగ్డే నటిస్తుంది. ఆమెకు అన్న పాత్రలో విక్టరీ వెంకటేష్ కనిపించబోతున్నాడు అని తెలుస్తుంది. కాగా ఈ మూవీలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక పాటలో సల్మాన్ అండ్ వెంకీ మామతో కలిసి చిందేయనున్నాడు. ఇప్పటికే సగభాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రంలో జగపతిబాబు విలన్‌గా కనిపించబోతున్నాడు.
Wishing you a very happy birthday and lots of love dear @BeingSalmanKhan
May you have a great year ahead ? pic.twitter.com/nDvf4ClTAP— Venkatesh Daggubati (@VenkyMama) December 27, 2022