VD 12 : డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి- విజయ్ దేవరకొండ సినిమా నుంచి కీలక అప్డేట్..
జెర్సీ(Jersy) సినిమా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి(Gowtham Thinnanuri) దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా VD12 వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కనుంది. ధమాకా ఫేమ్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.
- Thota Vamshi Kumar
- Published on- June 16, 2023 / 08:32 PM IST
Vijay Devarakonda-Gowtham Thinnanuri
Vijay Devarakonda VD 12: ‘లైగర్’ ఆశించిన విజయాన్ని అందివ్వకపోవడంతో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda ) సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చాడు. ఆ తరువాత వరుసగా చిత్రాలను లైన్‌లో పెడుతున్నాడు. సమంత హీరోయిన్ నటిస్తున్న ‘ఖుషీ’ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా మరో సినిమా షూటింగ్‌ను ప్రారంభించాడు. జెర్సీ(Jersy) సినిమా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి(Gowtham Thinnanuri) దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా VD12 వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కనుంది.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ధమాకా ఫేమ్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు మే 3న జరుగగా.. అప్పటి నుంచి ఈ చిత్రం నుంచి మరో అప్డేట్ లేదు. అయితే.. ఎట్టకేలకు ఈ సినిమా నుంచి ఓ అప్డేట్ వచ్చింది. నేటి నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ విషయాన్ని చిత్ర బృందం ఓ పోస్టర్ ద్వారా తెలియజేసింది.
VS11 : దాస్ గాడి గర్ల్‌ఫ్రెండ్‌ను చూశారా..? కోపంగా చూస్తున్న రత్నమాల.. ఏమై ఉంటుంది..?
ఈ పోస్టర్‌లో విజయ్ గన్ పట్టుకుని కాల్చడంతో పొగలు రావడాన్ని గమనించవచ్చు. అయితే.. విజయ్ ఫేస్‌ను పూర్తిగా రివీల్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రౌడీ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ సినిమా ఒకటి కాగా రెండోది గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో నటించనున్న VD12. ఈ రెండు సినిమాలే కాకుండా పశురాం దర్శకత్వంలో దిల్ రాజ్ నిర్మాణంలో మరో సినిమాలో విజయ్ నటిస్తున్నాడు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు బుధవారం (జూన్ 14న) జరిగింది. VD13 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
