Vijay Devarakonda : అప్పుడు సమంతకి ముద్దు పెట్టలేదు అని చెప్పిన విజయ్.. ఇప్పుడు ఖుషి సినిమాలో..
విజయ్ కి సీరియల్ కిస్సర్ అని పేరు ఉన్న సంగతి తెలిసిందే. పెళ్లి చూపులు సినిమా తర్వాత ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో హీరోయిన్స్ తో లిప్ కిస్ సీన్స్ ఉన్నాయి విజయ్‌కు.
- Saketh U
- Published On : September 5, 2023 / 10:55 AM IST
Vijay Devarakonda Samantha Kiss Scene in kushi movie goes viral vijay talk about kiss scene with samantha one year before already
Vijay Devarakonda ; విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) జంటగా శివ నిర్వాణ(Shiva Nirvana) దర్శకత్వంలో వచ్చిన లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఖుషి(Kushi) సినిమా సెప్టెంబర్ 1న గ్రాండ్ గా రిలీజయి మంచి విజయం అందుకుంది. ఇప్పటికే ఈ సినిమా మూడు రోజుల్లోనే 70 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి 100 కోట్ల కలెక్షన్స్ కి దూసుకుపోతుంది.
అయితే ఖుషి సినిమా సక్సెస్ తో పాటు విజయ్ సమంతల మధ్య లిప్ కిస్ సీన్స్, వాళ్ళ మధ్య రొమాంటిక్ సీన్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. విజయ్ గత సినిమాల్లో లాగే ఖుషి సినిమాలో విజయ్ సమంత మధ్య రొమాంటిక్ సీన్స్ బాగానే ఉన్నాయి. దీంతో ఇవి ఇప్పుడు వైరల్ గా మారాయి.
విజయ్ కి సీరియల్ కిస్సర్ అని పేరు ఉన్న సంగతి తెలిసిందే. పెళ్లి చూపులు సినిమా తర్వాత ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో హీరోయిన్స్ తో లిప్ కిస్ సీన్స్ ఉన్నాయి విజయ్‌కు. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, ద్వారక, వరల్డ్ ఫేమస్ లవర్, డియర్ కామ్రేడ్.. ఇలా దాదాపు అన్ని సినిమాల్లోనూ విజయ్ కి హీరోయిన్స్ తో లిప్ కిస్ సీన్స్ ఉన్నాయి. విజయ్ సినిమాలో కచ్చితంగా లిప్ కిస్ సీన్స్, రొమాంటిక్ సీన్స్ ఉంటాయని ఆడియన్స్ కూడా ఫిక్స్ అయ్యారు. ఖుషిలో మొదటి నుంచి ఫ్యామిలీ స్టోరీ అని చెప్తే ఇందులో ఉండవు అనుకున్నారు. కానీ సినిమా చూశాక ఖుషి సినిమాలో కూడా విజయ్ సమంతల మధ్య లిప్ కిస్ సీన్స్, రొమాంటిక్ సీన్స్ ఉండటంతో జనాలు ఇది మాములే కదా విజయ్ సినిమాలో అని అనుకుంటున్నారు.
అయితే గతంలో విజయ్ సమంత ఇంటర్వ్యూ కి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. సమంత హోస్ట్ గా ఆహా ఓటీటీలో సామ్ జామ్ అనే ఓ షో చేసిన సంగతి తెలిసిందే. ఈ షోకి ఒక ఎపిసోడ్ లో విజయ్ దేవరకొండ కూడా గెస్ట్ గా వచ్చాడు. ఈ షోలో విజయ్ ని సమంత సీరియల్ కిస్సర్ అని అంటే కాదు, నేను ఇప్పటిదాకా సమంతకే ముద్దు పెట్టలేదు అని చెప్పాడు. అప్పట్లోనే ఈ వీడియో బాగా వైరల్ అయింది. ఈ వీడియో చూసిన వాళ్లంతా సమంతతో విజయ్ సినిమా తీస్తే కచ్చితంగా కిస్ సీన్ ఉంటుంది అయితే అని కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఖుషి సినిమాలో సమంతతో లిప్ కిస్ సీన్స్ ఉండటంతో ఈ వీడియో వైరల్ గా మారింది. అప్పుడు సమంతకు ముద్దు పెట్టలేదు అని చెప్పి ఇప్పుడు సినిమాలో పెట్టాడు, అనుకున్నట్టే జరిగింది అని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
