×
Ad

Vijay Deverakonda Mother : అమ్మకు ప్రేమతో అదిరిపోయే గిఫ్ట్..

విజయ్ దేవరకొండ తన తల్లి మాధవి దేవరకొండకు మెమరబుల్ బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చాడు..

  • Published On : September 24, 2021 / 04:10 PM IST

Vijay Deverakonda Mother

Vijay Deverakonda Mother: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తన తల్లి మాధవి దేవరకొండకు అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చాడు. ప్రయోజకుడైన కొడుకు ప్రేమతో తనకిచ్చిన పుట్టినరోజు కానుకను తనివి తీరా చూస్తూ ముచ్చటపడ్డారు మాధవి.

Love Story Review : ‘లవ్ స్టోరీ’ రివ్యూ..

ఇప్పటికే రౌడీ బ్రాండ్‌తో క్లాతింగ్ బిజినెస్‌లోకి దిగి యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న విజయ్ రీసెంట్‌గా థియేటర్ బిజినెస్‌లోకి కూడా ఎంటర్ అయ్యాడు. పాపులర్ మల్టీప్లెక్స్ ఏషియన్ గ్రూప్‌తో కలిసి AVD ఏషియన్ విజయ్ దేవరకొండ సినిమాస్ నిర్మించారు.

Mahesh Babu House : ఇంటి కోసం అన్ని కోట్లా..!

తన స్వస్థలమైన మహబూబ్ నగర్‌లో, అత్యాధునిక సౌకర్యాలతో AVD సినిమాస్‌ను నిర్మించారు. తల్లి మాధవి పుట్టినరోజు సందర్భంగా ఈ మల్టీప్లెక్స్‌ను అమ్మకు బర్త్‌డే గిఫ్ట్‌గా ఇస్తున్నట్లు చెబుతూ సోషల్ మీడియాలో పిక్ షేర్ చేశాడు విజయ్. శుక్రవారం ‘లవ్ స్టోరీ’ సినిమాతో గ్రాండ్‌గా ప్రారంభమైంది విజయ్ దేవరకొండ థియేటర్. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తున్న ‘లైగర్’ సినిమా గోవాలో షూటింగ్ జరుపుకుంటుంది. అందుకే విజయ్, మల్టీప్లెక్స్ ఓపెనింగ్‌కి రాలేకపోయాడు..