Mahesh Babu House : ఇంటి కోసం అన్ని కోట్లా..!

ఆర్ట్ డైరెక్టర్ ఏ.ఎస్. ప్రకాష్ ఆధ్వర్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంటికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి..

Mahesh Babu House : ఇంటి కోసం అన్ని కోట్లా..!

Ssmb 28

Updated On : September 24, 2021 / 4:25 PM IST

Mahesh Babu House: సెలబ్రిటీల లైఫ్ స్టైలే వేరబ్బా.. ఉండే ఇల్లు, ఆఫీసులు, కార్లు ఇలా అన్నీ కూడా లగ్జీరియస్‌గా.. రేంజుకి తగ్గట్టుగా ఉంటాయి. ఇప్పుడు మహేష్ బాబు కోసం కొత్తగా ఓ ఇల్లు నిర్మిస్తున్నారు. అంటే మహేష్ కొత్త ఇళ్లు కట్టుకుంటున్నాడా అనుకునేరు. ఆ ఇల్లు రియల్ లైఫ్ కోసం కాదు రీల్ లైఫ్ కోసం.. వివరాల్లోకి వెళ్తే..

Love Story Review : ‘లవ్ స్టోరీ’ రివ్యూ..

సూపర్‌స్టార్ మహేష్ బాబు, స్టార్ రైటర్ అండ్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో ముచ్చటగా మూడో సినిమా రాబోతోంది. వీరి కలయికలో వచ్చిన ‘అతడు’ సూపర్ డూపర్ హిట్ అవడమే కాక, టీవీలోనూ TRP రేటింగ్స్ పరంగా రికార్డ్ క్రియేట్ చేసింది. ‘ఖలేజా’ కాస్త నిరాశపరిచినా సూపర్ స్టార్‌లోని సరికొత్త కామెడీ కోణాన్ని చూపించారు త్రివిక్రమ్.. మధ్యలో మహేష్ బాబుతో యాడ్ కూడా చేశారు.. దాదాపు 11 సంవత్సరాల తర్వాత ఈ క్రేజీ కాంబో రిపీట్ అవుతుంది.

Pooja Hegde : భూమిక మ్యాజిక్ పూజా హెగ్డే రిపీట్ చేస్తుందా..?

త్రివిక్రమ్ ఆస్థాన నిర్మాత ఎస్. రాధ కృష్ణ (చినబాబు) హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మహేష్ నటించబోయే 28వ సినిమా ఇది. కథానాయికగా పూజా హెగ్డే పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం ఆర్ట్ డైరెక్టర్ ఏ.ఎస్. ప్రకాష్ ఓ భారీ ఇంటి సెట్ నిర్మిస్తున్నారట. హీరో ఉండే ఈ ఇంటి కోసం దాదాపు 5 కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నారనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ప్రస్తుతం మహేష్, పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు. 2022 సంక్రాంతికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Evaru Meelo Koteeswarulu : తారక్ షో కి గెస్ట్‌గా మహేష్ బాబు..