Rowdy Janardhana : విజయ్ దేవరకొండ గుండెలపై కాలు పెట్టిన కీర్తి సురేష్.. బర్త్ డే పోస్టర్ వైరల్..
నేడు విజయ్ దేవరకొండ పుట్టిన రోజు కావడంతో ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు. (Rowdy Janardhana)
- Saketh U
- Published on- May 9, 2026 / 10:19 AM IST
Rowdy Janardhana
Rowdy Janardhana : విజయ్ దేవరకొండ హీరోగా రవికిరణ్ కోలా దర్శకత్వంలో రౌడీ జనార్ధన అనే సినిమా తెరకెక్కుతోంది. కీర్తి సురేశ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న రౌడీ జనార్ధన సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసారు. ఆ గ్లింప్స్ లో విజయ్ ఊరమాస్ లుక్‌లో, కండలు తిరిగిన దేహంతో, ఒండినిండా రక్తపు మరకలు, చేతిలో కత్తితో కనపడటంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. నేడు విజయ్ దేవరకొండ పుట్టిన రోజు కావడంతో ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు.
Also Read : Vijay Deverakonda : బర్త్ డే స్పెషల్.. ఫ్యామిలీతో విజయ్ దేవరకొండ ఫోటోలు చూశారా..?
వర్షంలో విజయ్ దేవరకొండ తుపాకీ పట్టుకొని కూర్చొని ఉంటే కీర్తి సురేష్ విజయ్ గుండెలపై తన్నినట్టు ఉంది. అయితే ఈ పోస్టర్ లో కేవలం కీర్తి సురేష్ కాలు మాత్రమే చూపించడం గమనార్హం. దీంతో రౌడీ జనార్ధన బర్త్ డే స్పెషల్ పోస్టర్ వైరల్ గా మారింది. ఈ సినిమా 2026 డిసెంబర్ లో రిలీజ్ కానుంది.
