రాజకీయాలు, ఓటు హక్కుపై విజయ్ దేవరకొండ కామెంట్స్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..

  • Publish Date - October 10, 2020 / 06:46 PM IST

Vijay Deverakonda commentes on politics: టాలీవుడ్ క్రేజీ హీరో.. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తక్కువ సమంలోనే మంచి హిట్స్‌తో గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు తన Style & Attitude తో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. తాజాగా ఈ విజయ్.. ఓటు హక్కుపై చేసిన కామెంట్స్ వైరల్ కావడంతో పాటు విమర్శలు కూడా ఎదుర్కొంటున్నాయి.


రాజకీయాలపై తన అభిప్రాయాన్ని చెబుతూనే.. ఓటు వేసే హక్కు అందరికీ ఇవ్వకూడదని చెప్పుకొచ్చాడు. పేద వాళ్లకు, డబ్బున్న వాళ్లకు ఓటు హక్కు ఉండకూడదని, కేవలం మధ్య తరగతి వారికి మాత్రమే ఓటు హక్కు ఉండాలని అన్నాడు. అలాగే లిక్కర్ తీసుకుని ఓటు వేసే వారికి ఓటు హక్కు ఉండకూడదన్నాడు. విమానం నడిపే పైలట్‌ని దానిలో ఎక్కే 300 మంది ప్రయాణికులు ఓట్లు వేసి ఎన్నుకోరు కదా.. అలాగే సమాజాన్ని నడిపే బాధ్యతను పూర్తి అవగాహన ఉన్న నాయకుడి చేతిలో మాత్రమే పెట్టాలి. అంతే తప్ప అందరికి ఓటు హక్కు కల్పించకూడదు అన్నాడు.


రాజకీయాల గురించి విజయ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. విజయ్ వ్యాఖ్యలను కొందరు విమర్శిస్తుండగా, మరికొందరు అతడికి సపోర్ట్ చేస్తున్నారు. విజయ్ ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ (వర్కింగ్ టైటిల్) అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. విజయ్ నటిస్తున్న 10 వ సినిమా ఇది. బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే కథానాయికగా నటిస్తోంది.