Kalanithi Maran : అంతా అయిపోయాక ఇప్పుడెందుకు? కూలీ కోసం కోర్టుకెళ్లిన నిర్మాత.. ఇదేదో ముందే చెయ్యాల్సింది..

(Kalanithi Maran)ఈ సినిమాకు కలెక్షన్స్ ఇంకా ఎక్కువ రావాల్సింది, అవి తగ్గడానికి సెన్సార్ బోర్డు కారణమని కోర్టుకు వెళ్లారు కూలీ సినిమా నిర్మాత కళానిధి మారన్.

Kalanithi Maran : అంతా అయిపోయాక ఇప్పుడెందుకు? కూలీ కోసం కోర్టుకెళ్లిన నిర్మాత.. ఇదేదో ముందే చెయ్యాల్సింది..

Kalanithi Maran

Updated On : August 20, 2025 / 4:24 PM IST

Kalanithi Maran : రజినీకాంత్ మెయిన్ లీడ్ లో లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన కూలీ సినిమా ఇటీవల ఆగస్టు 14న రిలీజయి థియేటర్స్ లో పర్వాలేదనిపించింది. ఓపెనింగ్స్ మాత్రం భారీగా రాబట్టింది. ఇప్పటికే కూలీ సినిమా 450 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమాలో నాగార్జున విలన్ గా చేయగా, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, సౌభిన్ షాహిర్, శృతి హాసన్, రచిత రమ్య.. ఇలా చాలా మంది స్టార్స్ ఉన్నారు. దీంతో ముందు నుంచి ఈ సినిమాపై భారీ హైప్ ఉంది.(Kalanithi Maran)

అయితే ఈ సినిమాకు కలెక్షన్స్ ఇంకా ఎక్కువ రావాల్సింది, అవి తగ్గడానికి సెన్సార్ బోర్డు కారణమని కోర్టుకు వెళ్లారు కూలీ సినిమా నిర్మాత కళానిధి మారన్. కూలీ సినిమాకు A సరిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. సాధారణంగా సినిమాలో అడల్ట్ సీన్స్, రక్తం ఎక్కువ కనపడటం, మనుషులను చంపే సీన్స్, పిల్లలను, మహిళలను ఇబ్బంది పెట్టే సీన్స్ ఎక్కువగా ఉంటే A సరిఫికేట్ ఇస్తారు. అంటే A సర్టిఫికెట్ సినిమాకు 18 ఏళ్ళు దాటిన వాళ్లనే అనుమతిస్తారు.

Also Read : Allu Arjun Atlee : ఇక మొదలెడదామా..? అల్లు అర్జున్ అట్లీ సినిమా షూటింగ్ ఎప్పట్నుంచి..? దీపికా కూడా రెడీ..

అసలేమైందంటే :

కూలీ సినిమా చూసిన వాళ్లంతా A సరిఫికేట్ ఇచ్చేంత దారుణాలు సినిమాలు ఏమి లేవు, యూ/ఏ కూడా ఇవ్వొచ్చు అంటున్నారు. ఇక A సర్టిఫికెట్ సినిమా ఉండటంతో సింగిల్ థియేటర్స్ లో పట్టించుకోకపోయినా మల్టిప్లెక్స్ లలో మాత్రం పిల్లల్ని రానివ్వలేదు. దీంతో చాలా మల్టీప్లెక్స్ థియేటర్స్ వద్ద రజినీకాంత్ సినిమా అని పిల్లలతో, టీనేజర్స్ తో వచ్చిన పేరెంట్స్ గొడవ పడ్డారు. దీంతో కలెక్షన్స్ కూడా తగ్గాయి అని మూవీ యూనిట్ భావించింది.

దీంతో నిర్మాత కళానిధి మారన్ కూలీ సినిమాకు కలెక్షన్స్ తగ్గడానికి, కాస్త నెగిటివ్ టాక్ రావడానికి సెన్సార్ బోర్డు కారణం అని, దీనికంటే ఎక్కువ యాక్షన్ సీన్స్ ఉన్న సినిమాలకు యు/ఏ ఇచ్చారని, కూలీ సినిమా విషయంలో సెన్సార్ బోర్డు కరెక్ట్ కాదని, రజినీకాంత్ లాంటి స్టార్ 50 ఏళ్ళ సినీ కెరీర్ సమయంలో వచ్చిన సినిమాకు ఇలా చేయడం కరెక్ట్ కాదని, పిల్లల్ని, టీనేజర్స్ ని మా సినిమాకు దూరం చేసారని, అందుకు కలెక్షన్స్ కూడా తగ్గాయని, ఆ సర్టిఫికెట్ మార్చి ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు లో పిటిషన్ వేశారు.

Also Read : NTR : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం వార్ 2 క్లైమాక్స్ మార్చారా? లేదా ఆ సినిమా కోసమా?

సినిమాటోగ్రాఫ్ చట్టం, 1952, ట్రిబ్యునల్ సంస్కరణల చట్టం 2021 ప్రకారం హైకోర్టు ఇలాంటి పిటిషనస్ ని విచారించొచ్చు అని లాయర్లు తెలిపారు. దీంతో హైకోర్టు ఈ పిటిషన్ ని తీసుకుంది. మరి దీనిపై విచారణ జరిపి ఎలాంటి తీర్పు ఇస్తారు చూడాలి. అయితే ఈ పనేదో ముందే చేయొచ్చు కదా, సినిమా రిలీజయి వారం అవ్వొస్తుంటే ఇప్పుడు ఎందుకు, ముందే అయితే ఇంకా జనాలు వచ్చేవాళ్ళు, కలెక్షన్స్ పెరిగేవి అని పలువురు ఫ్యాన్స్, సినిమా లవర్స్ అభిప్రాయపడుతున్నారు.