Vijay Deverakonda : పెళ్లి పై విజయ్ దేవరకొండ కామెంట్స్.. అలాంటి అమ్మాయి..
ఖుషి ప్రమోషన్స్ లో ఉన్న విజయ్ దేవరకొండ పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం నా జాగ్రత్తలు అన్ని..
- gum 95921
- Published On : August 31, 2023 / 03:17 PM IST
Vijay Deverakonda comments on his marriage in Kushi promotions
Vijay Deverakonda : విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) మెయిన్ లీడ్ శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన మూవీ ‘ఖుషి’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం లవ్ అండ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఈ శుక్రవారం (సెప్టెంబర్ 1) ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న విజయ్ దేవరకొండ.. తాజాగా నేషనల్ వైడ్ ఫ్యాన్స్ తో సోషల్ మీడియా లైవ్ ద్వారా ఇంటరాక్ట్ అయ్యాడు. ఈక్రమంలోనే పెళ్లి గురించి ప్రశ్న ఎదురవ్వగా ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
“ప్రస్తుతం నా జాగ్రత్తలు అన్ని మా అమ్మే తీసుకుంటుంది. నేను వర్క్ లో పడి ఫుడ్ వంటి బేసిక్ థింగ్స్ కూడా మర్చిపోతా. అలాంటి నన్ను వర్క్ నుంచి బయటకు తీసుకొచ్చి పర్సనల్ లైఫ్ గుర్తుచేసే భార్య ఉండాలి. క్లియర్ గా చెప్పాలంటే నన్ను కేరింగ్ గా చూసుకునే లైఫ్ పార్టనర్ కావాలని కోరుకుంటున్నా. ఇక పెళ్లి పలానా టైంలోనే చేసుకోవాలని ఏమీ ఫిక్స్ చేసుకోలేదు. మ్యారేజ్ చేసుకోవాలని అనిపించినప్పుడు తప్పకుండా చేసుకుంటా. అయితే పెద్ద హడావుడి లేకుండా నా మ్యారేజ్ జరగాలని నేను కోరుకుంటున్నా. కానీ ఎవరికీ తెలియకుండా నేను ఆ విషయాన్ని దాచలేను” అంటూ చెప్పుకొచ్చాడు.
Urvashi Rautela : నిమిషానికి కోటి రూపాయలు.. అమ్మడిని ట్రోల్ చేస్తున్న నెటీజన్లు
ఇక ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇదే ఇంటర్వ్యూలో తన ఫేవరేట్ ఫుడ్ విషయాలను కూడా విజయ్ అభిమానులతో పంచుకున్నాడు. తనకి చాలా ఫేవరేట్ ఫుడ్స్ ఉన్నాయట. కానీ హైదరాబాద్ బిర్యానీ, దోశ, బర్గర్, ఛీజ్ కేక్ బాగా ఇష్టంగా తింటాడట. అయితే హీరోలు అంటే బాడీ మెయిన్‌టైన్ కోసం డైట్ పాటిస్తుంటారు. కానీ విజయ్ తనకి ఇష్టం ఉన్నవి అన్ని తింటూనే.. పలు వర్కవుట్లు చేసి బరువు పెరగకుండా చూసుకుంటాడట.
