Vijay Deverakonda: రిస్క్ చేస్తున్న విజయ్ దేవరకొండ.. ఈ టైంలో ఆ డైరెక్టర్ తో అవసరమా?
రెండు మాస్ చిత్రాల తరువాత క్లాస్ దర్శకుడితో సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ(Vijay Deverakonda).
- V Santhosh Kumar
- Published On : March 8, 2026 / 07:13 AM IST
Vijay deverakonda doing his next movie with director shouryuv
- క్లాస్ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చిన విజయ్ దేవరకొండ
- త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని టాక్
- ఈ టైంలో రిస్క్ అవసరమా అంటున్న ఫ్యాన్స్
Vijay Deverakonda; టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ పెళ్లిచేసుకున్న విషయం తెలిసిందే. గతకొన్నేళ్ళుగా రిలేషన్ లో ఉంటున్న తన ప్రేయసి, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మేడలో ఆయన మూడు ముళ్ళు వేశాడు. అలా, ఈ ఇద్దరు తమ జీవితాల్లో కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టేశారు. ఇక పెళ్లి వేడుక కూడా ముగియడంతో త్వరలోనే ఈ ఇద్దరు తమ తమ సినిమాల్లో బిజీ కానున్నారు.
విజయ్ దేవరకొండ విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన రెండు భారీ సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి రౌడీ జనార్ధన, రెండవది రానబాలి. ఈ రెండు కూడా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న సినిమాలు కావడం విశేషం. రౌడీ జనార్ధన సినిమాను దర్శకుడు రవి కిరణ్ కోలా తెరకెక్కిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్(Vijay Deverakonda) రౌడీగా మాస్ పాత్రలో కనిపించనున్నాడు.
Balakrishna: బాలకృష్ణ మూవీని రిజెక్ట్ చేసిన కుర్ర హీరో.. నావల్ల కాదు అనేసాడట.. ఆ హీరో ఎవరో తెలుసా?
ఇక రానబాలి విషయానికి వస్తే పీరియాడికల్ సెటప్ వస్తున్న ఈ సినిమాను దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కిస్తున్నాడు. గత కొంత కాలంగా సరైన హిట్స్ లేక బాధపడుతున్న విజయ్ దేవరకొండ ఈ రెండు సినిమాలపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత ఆయన క్రేజ్ కూడా మారిపోవడం ఖాయం. మాస్ ఇమేజ్ రావడం కూడా ఖాయం. అయితే, ఈ రెండు సినిమాల తరువాత మాత్రం ఒక క్లాస్ దర్శకుడికి ఛాన్స్ ఇవ్వబోతున్నాడట విజయ్ దేవరకొండ. ఆ దర్శకుడు మరెవరో కాదు శౌర్యువ్.
ఈ దర్శకుడు గతంలో నేచురల్ స్టార్ నానితో హాయ్ నాన్న సినిమాను చేశాడు. కమర్షియల్ గా కాకపోయినా ఓమోస్తరుగా ఆడింది ఈ సినిమా. ఇటీవల ఈ దర్శకుడు చెప్పిన కథకు ఒకే చెప్పేశాడట విజయ్ దేవరకొండ. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, రౌడీ జనార్ధన, రానబాలి లాంటి మాస్ అప్పీల్ ఉన్న సినిమాల తరువాత శౌర్యువ్ లాంటి దర్శకుడితో సినిమా అంటే కాస్త రిస్క్ అంటున్నారు అనలిస్టులు. విజయ్ ఫ్యాన్స్ కూడా అదే ఫీలవుతున్నారు. మరి ఫైనల్ గా ఏమవుతుంది అనేది చూడాలి.
