Vijay Deverakonda : రష్మికతో కలిసి విజయ్ దుబాయ్ వెకేషన్.. వైరల్ అవుతున్న ఫొటో..
రష్మికతో కలిసి దుబాయ్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న విజయ్. ఒక నెటిజెన్స్ చేసిన ఫొటో నెట్టింట వైరల్ గా మారింది.
- gum 95921
- Published On : April 7, 2024 / 03:08 PM IST
Vijay Deverakonda enjoying vacation with rashmika at dubai
Vijay Deverakonda : విజయ్ దేవరకొండ నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా థియేటర్స్ లో సందడి చేస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రానికి మంచి ఆదరణ పెరుగుతూ వెళ్తుంది. దీంతో మొదటిరోజు కంటే సెకండ్ డే థియేటర్స్ వద్ద ఎక్కువ సందడి కనిపించింది. ఇక ఇది ఇలా ఉంటే, అసలు విజయ్ దేవరకొండ ఎక్కడ ఉన్నారు అనేది ప్రశ్నగా మారింది. మూవీ రిలీజ్ ముందు రోజు నుంచి విజయ్ కనిపించడం లేదు.
సినిమా రిలీజ్ తరువాత ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో కూడా విజయ్ కనిపించలేదు. అయితే విజయ్ కనిపించకపోవడం పై నెట్టింట ఓ వార్త వైరల్ అవుతుంది. ఫ్యామిలీ స్టార్ సినిమా విడుదల రోజునే రష్మిక పుట్టినరోజు అన్న సంగతి అందరికి తెలిసిందే. ఈ బర్త్ డేని సెలబ్రేట్ చేయడం కోసమే.. విజయ్, రష్మిక వెకేషన్ కి వెళ్లారంటూ గత రెండు రోజులుగా నెట్టింట ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.
Also read : The Family Star : ‘ఫ్యామిలీ స్టార్’ బాగానే ఉన్నా ట్రోలింగ్ ఎందుకు? కావాలనే నెగిటివిటీ? రంగంలోకి దిల్ రాజు..
అయితే ఈ వార్తలకు సాక్ష్యాలు లేకపోవడంతో రూమర్స్ గానే నిలిచిపోయాయి. కానీ ఇప్పుడు ఓ సాక్ష్యాన్ని చూపిస్తూ.. ఆ వార్తలు నిజమే అంటున్నారు నెటిజెన్స్. దుబాయ్ జాయేద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో పని చేస్తున్న ఓ ఇండియన్ తన సోషల్ మీడియాలో విజయ్ తో కలిసి ఉన్న ఒక ఫొటోని షేర్ చేసాడు. ఇక ఆ పిక్ కింద.. “ఫొటో తీసింది శ్రీవల్లి” అంటూ రాసుకొచ్చాడు.
శ్రీవల్లి అనేది పుష్ప మూవీలో రష్మిక పోషించిన పాత్ర పేరు అని అందరికి తెలిసిందే. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజెన్స్.. విజయ్, రష్మికతో కలిసి దుబాయ్ లో వెకేషన్ ని ఎంజాయ్ చేసున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక, విజయ్ తమ ప్రేమ బంధాన్ని ఎంత రహస్యంగా ఉంచుదాం అనుకున్నా, ఎలాగోలా తమ లవ్ స్టోరీకి సంబంధించిన విషయాలు బయటకి వచ్చేస్తున్నాయి. అసలు వీరిద్దరూ తమ లవ్ స్టోరీని అఫీషియల్ గా ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి.
