Vijay Deverakonda : ‘మ్యాజిక్’ సినిమా రిలీజ్‌ జులైలో.. మరి VD12 సంగతి ఏంటి..?

'మ్యాజిక్' సినిమా రిలీజ్‌ని జులైలో ప్లాన్ చేస్తున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. మరి విజయ్ దేవరకొండ VD12 సంగతి ఏంటి..?

Vijay Deverakonda : జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి, విజయ్ దేవరకొండతో ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే విజయ్ ఈ మూవీని పక్కన పెట్టి ముందుగా ఫ్యామిలీ స్టార్ మూవీని పట్టాలెక్కించడంతో.. గౌతమ్ తిన్ననూరి ‘మ్యాజిక్’ అనే చిన్న సినిమాని స్టార్ట్ చేయాల్సి వచ్చింది. VD12ని నిర్మిస్తున్న సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలోనే గౌతమ్ తిన్నారి ఈ సినిమా చేస్తున్నారు.

ఈ మూవీలో కొత్త నటీనటులు కనిపించబోతున్నట్లు తెలియజేశారు. ఒక ఒరిజినల్ సాంగ్ ని కంపోజ్ చేయడం కోసం మ్యూజిక్ పై ఆసక్తి ఉన్న నలుగురు కాలేజీ స్టూడెంట్స్ చేసే ప్రయత్నమే ఈ మ్యాజిక్ సినిమా. టీనేజ్ మ్యూజికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రాన్ని జులైలో రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట.

Also read : Vijay : విజయ్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్ చెప్పిన దర్శకుడు.. ఆ సినిమా ఇక లేనట్లే..

ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. మరి VD12 పరిస్థితి ఏంటి..? ఫ్యామిలీ స్టార్ కూడా తమ ఆకలిని తీర్చకపోవడంతో విజయ్ ఫ్యాన్స్ ఆశలు అన్ని ఈ సినిమా పైనే ఉన్నాయి. కానీ మూవీ టీం మాత్రం ఈ సినిమా గురించిన ఒక చిన్న అప్డేట్ కూడా ఇవ్వడం లేదు. అసలు షూటింగ్ స్టార్ట్ అయ్యిందా లేదా..? హీరోయిన్ గా చేస్తున్న శ్రీలీల ఈ సినిమా నుంచి తప్పుకుంది అంటున్నారు. మరి కొత్త హీరోయిన్ ఎవరు..? టైటిల్ ఏంటి..? అన్న ప్రశ్నలు సమాధానాలు ఇవ్వడం లేదు.

అయితే కొన్ని విశ్వసనీయ సమాచారాల ప్రకారం.. ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా జరుపుకుంటూ ఫుల్ స్వింగ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. దర్శకుడు గౌతమ్ ప్రస్తుతం ఈ మూవీ పై ఫుల్ ఫోకస్ పెట్టి షూటింగ్ ని జరుపుతూ వస్తున్నారట. త్వరలోనే ఈ మూవీ టైటిల్ ని అనౌన్స్‌మెంట్ రావొచ్చని సమాచారం. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి తమిళ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు