Lik: ‘Lik’ సినిమాను మిస్ చేసుకున్న తెలుగు టాప్ హీరో.. ఎందుకో ఇప్పుడు అర్థమై ఉంటుంది!
తమిళ్ రీసెంట్ మూవీ Lik సినిమాను రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్ హీరో(Lik).
- V Santhosh Kumar
- Published On : April 11, 2026 / 02:54 PM IST
Vijay Deverakonda Misses Out the Lead Role in Lik movie
- రీసెంట్ గా విడుదలైన Lik మూవీ
- ముందు విజయ్ దేవరకొండను హీరోగా అనుకున్న దర్శకుడు
- అనివార్య కారణాల వల్ల రిజెక్ట్ చేసిన విజయ్ దేవరకొండ
Lik: తమిళ స్టార్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘Lik’ (Love Insurance Company). రొమాంటిక్ కామెడీ అండ్ ఫ్యూచరిస్టిక్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాపై కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ మంచి అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్ తో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఆడియన్స్ నుంచి ఈ సినిమాకు మిక్సుడ్ టాక్ వచ్చింది. దీంతో, కలెక్షన్స్ కూడా అదే లెవల్లో అందుకుంటుంది ఈ సినిమా.
Raaka: ‘రాకా’ కోసం దీపికా భారీ రెమ్యునరేషన్.. ఇండియాలోనే ఫస్ట్ అండ్ టాప్ హీరోయిన్ గా రికార్డ్
అయితే, తాజాగా ఈ సినిమా గురించి ఒక క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ గ మారింది. అదేంటంటే, Lik సినిమా కథను దర్శకుడు విఘ్నేష్ శివన్ మొదట విజయ్ దేవరకొండకు వినిపించినట్లు సమాచారం. విజయ్ ఇమేజ్‌కు ఈ కథ సరిగ్గా సరిపోతుందని భావించి ఆయనను సంప్రదించారు. అయితే, ఆ సమయంలో విజయ్ తన ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదని తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ ఉన్న విజయ్ ఈ సినిమా చేసి ఉంటే దీని స్థాయి మరింత పెరిగేదని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల విజయ్ ఈ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించారు.
విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేసిన తర్వాతే ఈ అవకాశం ‘లవ్ టుడే’ ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ వద్దకు వెళ్ళింది. ప్రదీప్ తనదైన కామెడీ టైమింగ్‌తో ఈ పాత్రకు న్యాయం చేస్తారని విఘ్నేష్ భావించారు. ఈ సినిమాలో ఎస్.జె. సూర్య కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. మరి lik సినిమాను విజయ్ దేవరకొండ చేసి ఉంటే ఎలా ఉండేది అని ఆయన ఫ్యాన్స్ ఆలోచన చేస్తున్నారు.
