Vijay Rashmika
Vijay Rashmika : విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న తమ పెళ్లిని ఘనంగా చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు వారం రోజుల పాటు పెళ్లి వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు. హల్దీ, సంగీత్, పెళ్లి, రిసెప్షన్, ఫ్యాన్స్ మీట్, మీడియా మీట్, అన్నదానాలు, స్వీట్స్ పంపిణి, టెంపుల్స్ విజిట్.. ఇలా పెళ్లి వేడుకలను ఘనంగా వారం రోజుల పాటు ఖాళీ లేకుండా సెలబ్రేట్ చేసుకుంది ఈ కొత్త జంట.
ప్రస్తుతం విజయ్ – రష్మిక వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. పెళ్లితో దాదాపు 20 రోజులకు పైగా వీరిద్దరూ సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. పెళ్లి వేడుకలతో అలసిపోయిన ఈ జంట ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు వర్క్ అంటున్నారు. విజయ్ – రష్మిక కలిసి రణబాలి సినిమా చేస్తున్నారు.
Also Read : Allu Arjun : అల్లు అర్జున్ కోసం రాబోతున్న సీఎం రేవంత్..? ఎప్పుడు ఎక్కడ?
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇందులో విజయ్ యోధుడిగా, అతని భార్య పాత్రలో రష్మిక కనిపించబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసి అంచనాలు పెంచారు.
ఈ సినిమా కొత్త షెడ్యూల్ మార్చ్ 12 నుంచి కర్నూల్ లో మొదలు కానుందని సమాచారం. విజయ్ ఆ రోజు నుంచే షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడు. ఆ తర్వాత రష్మిక కూడా అదే షూట్ లో కొంచెం గ్యాప్ తో జాయిన్ అవ్వనుంది. పెళ్లి తర్వాత ఎలాంటి వెకేషన్ కి వెళ్లకుండా విజయ్ – రష్మిక మూవీ షూట్ కి వచ్చేస్తుండటంతో అభినందిస్తున్నారు.
Also Read : Tejaswini Vygha : చీరకట్టులో దిల్ రాజు భార్య తేజస్విని వ్యాఘ క్యూట్ పోజులు..
పెళ్ళికి ముందే ఈ జంట పలు దేశాలకు వెకేషన్స్ కి వెళ్లి అక్కడ్నుంచి ఫొటోస్ షేర్ చేసి తమ ప్రేమ గురించి హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు షూటింగ్ హడావిడి అంతా అయ్యాక గ్యాప్ తీసుకొని వెకేషన్ కి వెళ్తారేమో అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. పెళ్లి తర్వాత ఈ జంట రణబాలి సినిమాతో సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.