×
Ad

Vijay Rashmika : విజయ్ – రష్మిక పెళ్లితో పాటు రిసెప్షన్ డేట్ కూడా ఫిక్స్.. ఎప్పుడు? ఎక్కడ?

ఈ జంట పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందా అని ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రముఖులు కూడా ఎదురుచూస్తున్నారు.(Vijay Rashmika )

Vijay Rashmika

Vijay Rashmika : విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గత కొన్నేళ్లుగా ప్రేమించుకొని, డేటింగ్ చేసి ఇటీవల ఎంగేజ్మెంట్ సైలెంట్ గా చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందా అని ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రముఖులు కూడా ఎదురుచూస్తున్నారు.(Vijay Rashmika )

విజయ్ – రష్మిక జంట పెళ్లి ఫిబ్రవరి 26న రాజస్థాన్ ఉదయ్ పూర్ లోని ఓ ప్యాలెస్ లో జరగనుంది. కేవలం కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య జరగనున్నట్టు ఇప్పటికే సమాచారం వచ్చింది. ప్రస్తుతం ఈ ఇద్దరూ సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. పెళ్లి కోసం గ్యాప్ తీసుకొని ఉదయ్ పూర్ లో పెళ్లి చేసుకోబోతున్నారు. ఫ్యాన్స్ వీరి పెళ్లి ఫోటోల కోసం ఎదురుచూస్తున్నారు.

Also Read : Swayambhu : నిఖిల్ స్వయంభు టీజర్ చూశారా..? బాహుబలి, మగధీర లెవల్లో..

తాజాగా వీరి రిసెప్షన్ డేట్ కూడా ఫిక్స్ అయింది. విజయ్ – రష్మిక పెళ్లి ఫిబ్రవరి 26న ఉదయ్ పూర్ లో అయ్యాక మార్చ్ 4న హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో వీరి రిసెప్షన్ జరగనుందని తెలుస్తుంది. వీరి రిసెప్షన్ కి టాలీవుడ్ సినీ ప్రముఖులు, సన్నిహితులు హాజరు కాబోతున్నట్టు సమాచారం.

ఇప్పటికే డియర్ కామ్రేడ్, గీత గోవిందం సినిమాల్లో కలిసి నటించిన ఈ జంట ప్రస్తుతం రణబాలి సినిమాలో కలిసి నటించబోతున్నారు. పెళ్ళికి కాస్త గ్యాప్ తీసుకొని ఇద్దరూ కలిసి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నారు.

Also Read : Anchor Sravanthi : ఆ రోజు సాయి ధరమ్ తేజ్ లేకపోతే.. 500 మంది మధ్యలో నేను ఒక్కదాన్నే.. స్రవంతి కామెంట్స్ వైరల్..