Vijay Rashmika : విజయ్ – రష్మిక పెళ్లి ఇన్విటేషన్ వైరల్.. పెళ్లి, రిసెప్షన్ ఎప్పుడు, ఎక్కడ..?
తాజాగా విజయ్ - రష్మిక పెళ్లి పత్రిక వైరల్ గా మారింది. (Vijay Rashmika)
- Saketh U
- Published On : February 16, 2026 / 02:47 PM IST
Vijay Rashmika
Vijay Rashmika : విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గత కొన్నేళ్లుగా ప్రేమించుకొని, డేటింగ్ చేసి ఇటీవల సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రముఖులు కూడా ఎదురుచూస్తున్నారు. విజయ్ – రష్మిక జంట పెళ్లి వేడుకలు దగ్గరకు వచ్చేసాయి. ఇటీవల విజయ్ దేవరకొండ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇచ్చాడు.(Vijay Rashmika)
తాజాగా విజయ్ – రష్మిక పెళ్లి పత్రిక వైరల్ గా మారింది. ఇది ఒక బాక్స్ లో సింపుల్ గా ఒక లెటర్ లా ఉంది. ఇందులో విజయ్ తన పెళ్ళికి పిలుస్తున్నట్టు ఉంది. ఇది విజయ్ తరపున ఇచ్చే పత్రిక అని తెలుస్తుంది. ఈ పెళ్లి పత్రికలో విజయ్ రష్మికల పెళ్లి, రిసెప్షన్ డీటెయిల్స్ ఉన్నాయి.
Also See : Vindhya Vishaka : షార్ట్ స్కర్ట్ లో స్పోర్ట్ యాంకర్ వింధ్య పోజులు..
ఫిబ్రవరి 26న రాజస్థాన్ ఉదయ్ పూర్ లోని ఓ ప్యాలెస్ లో విజయ్ – రష్మిక పెళ్లి జరగనుంది. పెళ్లి కేవలం కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య జరగనున్నట్టు సమాచారం. పెళ్లి తర్వాత రిసెప్షన్ మార్చి 4న హైదరాబాద్ బంజార్‌హిల్స్‌లోని తాజ్‌కృష్ణలో జరగనుంది. దీంతో ఫ్యాన్స్ వీరి పెళ్లి ఫోటోల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఇచ్చిన పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
