Vijay Deverakonda : నెగిటివిటి ఫేస్ చేయలేకపోతే ఇంటికెళ్ళిపో.. దేవుడ్ని, మోదీని కూడా తిట్టేవాళ్ళు ఉన్నారు..
తాజాగా కొంతమంది సీరియల్ నటీమణులతో విజయ్ దేవరకొండ ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు.
- Saketh U
- Published on- April 1, 2024 / 08:44 AM IST
Vijay Deverakonda Sensational Comments on Negativity in Social Media
Vijay Deverakonda : విజయ్ దేవరకొండ ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్(Family Star0 సినిమాతో రాబోతున్నాడు. గత సినిమాలు లైగర్ ఫ్లాప్ అవ్వగా ఖుషి యావరేజ్ గా నిలిచింది. ఇప్పటికే ఫ్యామిలీ స్టార్ సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్స్, సాంగ్స్ తో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అభిమానులు కూడా ఫ్యామిలీ స్టార్ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దిల్ రాజు నిర్మాణంలో పరుశురాం దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ తెరకెక్కగా మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) ఇందులో హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.
తాజాగా కొంతమంది సీరియల్ నటీమణులతో విజయ్ దేవరకొండ ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు. ఈ ఇంటర్వ్యూలో ఆ ఆర్టిస్టులు పలు ప్రశ్నలు అడగ్గా సమాధానాలు ఇచ్చాడు విజయ్. ఓ నటి సెలబ్రిటీలకు ఫ్యాన్స్ ప్రేమ ఎలా చూపిస్తారో, కొంతమంది తిడతారు, నెగిటివిటి చూపిస్తారు, దాన్ని మీరు ఎలా ఫేస్ చేస్తారు అని అడిగింది.
Also Read : Chiranjeevi : నువ్వేమన్న సూపర్ స్టార్ అనుకుంటున్నావా? చిరంజీవి పడ్డ అవమానం.. 200 మంది ముందు..
విజయ్ దేవరకొండ సమాధానమిస్తూ.. నన్ను ఎవ్వరు హీరో అవ్వమని చెప్పలేదు. నేనే అనుకున్నాను వచ్చాను. మనకి కావాలన్నది చేసేటప్పుడు పొగిడేవాళ్లు, ప్రేమించేవాళ్ళు, తిట్టేవాళ్ళు ఉంటారు. అవన్నీ నువ్వు ఫేస్ చేయగలగాలి. ఆ నెగిటివిటీని ఫేస్ చేయలేకపోతే ఇంటికి వెళ్ళిపో. నిన్నెవ్వరూ ఆపారు. నీ బదులు వేరే యాక్టర్ వస్తారు. సొసైటీలో గాంధీని, మన ప్రధాని నరేంద్ర మోదీని, ఆఖరికి దేవుడ్ని కూడా తిట్టేవాళ్ళు ఉంటారు. వాళ్ళ పని అదే. తిట్టేవాళ్ళని పట్టించుకుంటే మనం ఏం చేయలేము. ప్రపంచంలో అది కూడా ఒక పార్ట్. మనం నచ్చినట్టు మన పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి, మన కోసం మనం కష్టపడాలి. మనం చేసే పని కొన్ని వర్క్ అవుతాయి, కొన్ని వర్క్ అవ్వవు. అన్ని తీసుకొని వెళ్లిపోవడమే అని అన్నాడు. దీంతో విజయ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
