×
Ad

Vijay Deverakonda : నటనకు విరామం ఇచ్చి.. డైరెక్షన్ చేస్తా.. అలాగే బిజినెస్ కూడా..

ఖుషి ప్రమోషన్స్ లో భాగంగా ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయ్యిన విజయ్ దేవరకొండ.. నటనకు విరామం ఇచ్చి డైరెక్షన్ చేస్తాను అంటూ వైరల్ కామెంట్స్ చేశాడు.

  • Published On : August 31, 2023 / 03:40 PM IST

Vijay Deverakonda takes break from acting and try direction

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ, సమంత (Samantha) నటించిన ఖుషి సినిమా ఈ శుక్రవారం సెప్టెంబర్ 1న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ.. నేషనల్ వైడ్ ఫ్యాన్స్ తో సోషల్ మీడియా లైవ్ ద్వారా ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ ఇంటరాక్షన్ లో ఖుషి హైలైట్స్ తో పాటు పర్సనల్ లైఫ్ లో విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నాడు. ఈక్రమంలోనే డైరెక్షన్, బిజినెస్ గురించి మాట్లాడాడు.

Vijay Deverakonda : పెళ్లి పై విజయ్ దేవరకొండ కామెంట్స్.. అలాంటి అమ్మాయి..

“డైరెక్షన్ చేయడం అనేది నన్ను చాలా ఎగ్జైట్ చేస్తూ ఉంటుంది. లైఫ్ లో కొద్ది కాలం తర్వాత యాక్టింగ్ నుంచి బ్రేక్ తీసుకుని డైరెక్షన్ చేయాలని అనుకుంటున్నా. కానీ నా దగ్గరకు వచ్చే స్క్రిప్ట్స్ చదువుతుంటే నటించడం ఆపలేను అనిపిస్తుంటుంది. ప్రస్తుతం వయసు ఉంది కాబట్టి ఇప్పుడు ఎంతైనా కష్టపడగలను. ఫ్యూచర్ లో ఏదో ఒక పాయింట్ లో కచ్చితంగా డైరెక్షన్ వైపు మాత్రం వెళ్తాను” అంటూ పేర్కొన్నాడు.అలాగే బిజినెస్ చేసే ఆలోచనలు కూడా ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చాడు. ఈ విషయం పై తన ఫ్యామిలీ అండ్ టీమ్ తో చర్చిస్తున్నట్లు, త్వరలోనే ఎంటర్ ప్రెన్యూర్ గా తన నుంచి ఒక ప్రకటన వస్తుందని వెల్లడించాడు.

Jawan : జవాన్ ట్రైలర్‌లో చెప్పిన షారుఖ్ డైలాగ్‌ని.. ఆ విషయానికి లింక్ చేస్తున్న నెటిజెన్స్.. ఏంటది..?

ఇక లైఫ్ లో ఎదురయ్యే సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడుతూ.. “ఫెయిల్యూర్ అనేది చాలా ముఖ్యం. నేనూ లైఫ్ లో బిగ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ చూశాను. నా దృష్టిలో ఫెయిల్యూర్, సక్సెస్ ఒకేలా చూడాలి. చేసిన తప్పులు చేయకుండా అపజయాల నుంచి నేర్చుకోవాలి. ఫెయిల్యూర్ మనకు చాలా విషయాలు నేర్పిస్తుంది. జీవితం అంటే ఓడటం, గెలవడం కాదు జీవించడం. లైఫ్ లో మిమ్మల్ని మీరు ఏ పొజిషన్ లో చూడాలని అనుకుంటున్నారో ఆ గమ్యం వైపు ఒక్కో అడుగు వేస్తూ వెళ్లండి” తన అనుభవంతో సలహా అభిమానులకు ఇచ్చాడు.