Vijay Deverakonda : తెలంగాణ సర్కార్ ఇండస్ట్రీ బాగును కోరుకుంటోంది..
సినిమా టికెట్ ధరలు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విజయ్ దేవరకొండ హర్షం వ్యక్తం చేశారు..
- sekhar
- Published on- December 25, 2021 / 02:41 PM IST
Vijay Deverakonda
Vijay Deverakonda: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. సినిమా టికెట్ రేట్లను పెంచేందుకు అనుమతిస్తూ జీవోను విడుదల చేసింది. టికెట్ ధరలు పెంచాలంటూ తాజాగా టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు తెలంగాణ ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. దీనిపై స్పందించిన కేసీఆర్ టాలీవుడ్ సినీ పరిశ్రమ అభ్యర్థనను ఆమోదించాల్సిందిగా హోంశాఖ అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు టికెట్ ధరలను సిద్ధం చేసి.. శనివారం జీవో విడుదల చేశారు.
Telangana Movie Tickets Rate : సినిమా టికెట్ రేట్లపై కొత్త జీవో.. కేసీఆర్‌కు చిరు కృతఙ్ఞతలు
తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌కు కృతఙ్ఞతలు తెలిపుతూ ట్వీట్ చేశారాయన. రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమా టికెట్ ధరల పెంపుపై హర్షం వ్యక్తం చేశారు. జీవోను షేర్ చేస్తూ ట్వీట్ చేశారు విజయ్.
‘తెలంగాణ ప్రభుత్వానికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే.. రాష్ట్రంలో ఆరోగ్యకరమైన అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది.. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, తలసానిలు ఎంతో కృషి చేస్తున్నారు.. తెలంగాణ ప్రభుత్వం నూటికి నూటొక్క శాతం సినీ పరిశ్రమను పరిశ్రమగా మార్చాలని ఆలోచిస్తోంది.. నేను నా ప్రభుత్వాన్ని ప్రేమిస్తున్నాను.. తెలుగు చలన చిత్ర పరిశ్రమ దేశంలోనే అతి పెద్ద పరిశ్రమ’ అంటూ విజయ్ దేవరకొండ ట్వీట్లో పేర్కొన్నారు.
