Vijay Deverakonda : ఓ పక్క ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్.. కానీ అమెరికాలో రష్మిక బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో బిజీగా విజయ్ దేవరకొండ..

విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమా రష్మిక పుట్టిన రోజు ఏప్రిల్ 5 నాడే రిలీజ్ అవుతుంది.

  • Updated on- April 4, 2024 / 07:33 AM IST

Vijay Deverakonda went to America for Rashmika Mandanna Birthday Celebrations Even Family Star Release

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) జంటగా నటించిన ఫ్యామిలీ స్టార్(Family Star) సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న విజయ్ కి ఈ సినిమాతో హిట్ వస్తుందని అంతా భావిస్తున్నారు. మూవీ యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. అయితే విజయ్ మాత్రం ఇలాంటి టైంలో అమెరికాకు చెక్కేసాడు.

ఫ్యామిలీ స్టార్ సినిమా రష్మిక(Rashmika Mandanna) పుట్టిన రోజు ఏప్రిల్ 5 నాడే రిలీజ్ అవుతుంది. రష్మిక, విజయ్ దేవరకొండ మధ్య ఏదో ఉందని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. వీళ్లిద్దరి మధ్య ఏం ఉన్నా లేకపోయినా వీళ్ళు బాగా క్లోజ్ అని మాత్రం అందరికి తెలుసు. రష్మిక, విజయ్ కలిసి పార్టీలు చేసుకుంటారు, ట్రిప్పులకు వెళ్తారు, పండగలకు రష్మిక విజయ్ ఇంటికి వస్తుందని అందరికి తెలిసిందే.

Also Read : Raviteja : మళ్ళీ కామెడీ ట్రాక్‌లోకి రానున్న రవితేజ.. యాక్షన్ వర్కౌట్ అవ్వట్లేదని..

దీంతో ఈ సారి కూడా రష్మిక బర్త్ డేకి ఇద్దరూ ఒకేచోట ఉండి సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. ఇప్పటికే రష్మిక, విజయ్ అమెరికాకు వెళ్లిపోయారు. అయితే తన ఫ్యామిలీ స్టార్ సినిమా కూడా అదే రోజు రిలీజ్ ఉండటంతో అమెరికాలో ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ చేసుకుంటూనే రష్మిక బర్త్ డే సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటారని సమాచారం. తన సినిమా రిలిజ్ ఉన్నా కూడా రష్మిక బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం వెళ్ళాడు అంటే వీరిద్దరి మధ్య ఏదో ఉంది, మరీ ఇంత క్లోజా వీళ్ళిద్దరూ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక బర్త్ డే సెలబ్రేషన్స్ నుంచి వీళ్లిద్దరు కలిసి ఉన్న ఫోటో ఒక్కటైనా లీక్ అవ్వదా అని ఎదురుచూస్తున్నారు అభిమానులు.