Vijay Deverakonda : అమెరికాలో ఫ్యామిలీతో విజయ్ దేవరకొండ.. సెల్ఫీల కోసం ఎగబడ్డ జనాలు..

తాజాగా విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు అమెరికా వెళ్ళాడు.

Vijay Deverakonda : అమెరికాలో ఫ్యామిలీతో విజయ్ దేవరకొండ.. సెల్ఫీల కోసం ఎగబడ్డ జనాలు..

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ ప్రస్తుతం భారీ సినిమాలతో బిజీగా ఉన్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న VD12 సినిమా షూటింగ్ ఇటీవల వైజాగ్ లో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. తాజాగా విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు అమెరికా వెళ్ళాడు. విజయ్, తమ్ముడు ఆనంద్, విజయ్ పేరెంట్స్.. అందరూ కలిసి అమెరికా వెకేషన్ కి వెళ్లారు.

Also Read : NTR – Yvs Chowdary : ఎన్టీఆర్ మునిమనవడు.. ఎన్టీఆర్ హీరోగా వైవిఎస్ చౌదరి సినిమా అనౌన్స్..

అమెరికాలో విజయ్ ఫ్యామిలీతో దిగిన ఫోటో వైరల్ గా మారింది. అలాగే విజయ్ అమెరికా తెలుగు అసోసియేషన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొనడంతో అక్కడ తెలుగు జనాలు విజయ్ తో సెల్ఫీల కోసం, ఫోటోల కోసం ఎగబడ్డారు. విజయ్ తో సెల్ఫీల కోసం ఎగబడ్డ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అమెరికాలో కూడా విజయ్ క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది అంటూ అభిమానులు ఈ వీడియోలను షేర్ చేస్తున్నారు.