NTR – Yvs Chowdary : ఎన్టీఆర్ మునిమనవడు.. ఎన్టీఆర్ హీరోగా వైవిఎస్ చౌదరి సినిమా అనౌన్స్..

దాదాపు 9 ఏళ్ళ తర్వాత మళ్ళీ మెగా ఫోన్ పట్టుకోబోతున్నారు వైవిఎస్ చౌదరి.

NTR – Yvs Chowdary : ఎన్టీఆర్ మునిమనవడు.. ఎన్టీఆర్ హీరోగా వైవిఎస్ చౌదరి సినిమా అనౌన్స్..

Yvs Chowdary Re Entry as Director with New Hero Nandamuri Harikrishna Grand Son NTR

Updated On : June 10, 2024 / 10:58 AM IST

NTR – Yvs Chowdary : గతంలో శ్రీ సీతారాముల కళ్యాణం చూతుము రారండి, సీతారామరాజు, యువరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు.. లాంటి పలు సూపర్ హిట్ సినిమాలు తీసిన దర్శకుడు వైవిఎస్ చౌదరి. ఆ తర్వాత వరుస ఫ్లాప్స్ పడటం, నిర్మాతగా కూడా లాస్ అవ్వడంతో సినిమాలకు దూరంగా ఉన్నారు.

దాదాపు 9 ఏళ్ళ తర్వాత మళ్ళీ మెగా ఫోన్ పట్టుకోబోతున్నారు వైవిఎస్ చౌదరి. సీనియర్ ఎన్టీఆర్ కి వైవిఎస్ చౌదరి వీరాభిమాని అని తెలిసిందే. ఇప్పుడు అదే ఫ్యామిలీ నుంచి వైవిఎస్ కొత్త హీరోని పరిచయం చేయబోతూ తన నెక్స్ట్ సినిమాని ప్రకటించారు. తన భార్య యలమంచలి గీత నిర్మాతగా న్యూ ట్యాలెంట్ రోర్స్@(NTR@) అనే కొత్త బ్యానర్ పై ఈ సినిమాని స్వయంగా నిర్మిస్తున్నారు.

Also Read : Balakrishna : పంచె కట్టిన బాలయ్య.. పుట్టిన రోజు నాడు హిందూపురంలో స్పెషల్ పూజలు..

దివంగత నందమూరి హరికృష్ణ(Harikrishna) మనవడు, దివంగత నందమూరి జానకిరామ్(Janaki Ram) పెద్ద కొడుకుని వైవిఎస్ చౌదరి హీరోగా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు. అతని పేరు కూడా నందమూరి తారక రామారావు. దీంతో ఈ కొత్త ఎన్టీఆర్ ని వైవిఎస్ చౌదరి హీరోగా లాంచ్ చేస్తున్నారు. నేడు ఈ సినిమా పూజ కార్యక్రమం నిర్వహించి సినిమాని ప్రకటించారు. అలాగే ఈ సినిమాలో కొత్త తెలుగమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేయబోతున్నారు. అయితే ఆ కొత్త ఎన్టీఆర్ ఎలా ఉంటాడు అనేది మాత్రం చూపించలేదు. త్వరలో మరో ఈవెంట్ పెట్టి కొత్త ఎన్టీఆర్ ని, హీరోయిన్ ని పరిచయం చేస్తామని ప్రకటించారు.

మరి ఈ కొత్త ఎన్టీఆర్(NTR) తన తాత, ముత్తాత, బాబాయ్ లాగే నటనలో మెప్పిస్తాడా చూడాలి. వైవిఎస్ చౌదరి కూడా రీ ఎంట్రీతో మళ్ళీహీట్ కొట్టి ఫామ్ లోకి వస్తాడా చూడాలి.