Balakrishna : పంచె కట్టిన బాలయ్య.. పుట్టిన రోజు నాడు హిందూపురంలో స్పెషల్ పూజలు..

బాలయ్య మూడో సారి హిందూపురం నుంచి గెలవడంతో ఈ సారి తన పుట్టిన రోజు వేడుకలను హిందూపురంలోనే తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానుల మధ్య జరుపుకుంటున్నారు.

Balakrishna : పంచె కట్టిన బాలయ్య.. పుట్టిన రోజు నాడు హిందూపురంలో స్పెషల్ పూజలు..

Balakrishna Special Pooja on his Birthday at Hindupuram Anjaneyaswami Temple

Updated On : June 10, 2024 / 10:29 AM IST

Balakrishna : నేడు నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు కావడంతో అభిమానులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఓ పక్క వరుస సినిమాలు హిట్స్ కొడుతూ, మరో పక్క ఇటీవలే మూడో సారి ఎమ్మెల్యేగా గెలిచి హిందూపురంలో హ్యాట్రిక్ సృష్టించాడు బాలయ్య. దీంతో ఈ పుట్టిన రోజు అభిమానులకు, తెలుగుదేశం కార్యకర్తలకు మరింత స్పెషల్ గా మారింది.

బాలయ్య మూడో సారి హిందూపురం నుంచి గెలవడంతో ఈ సారి తన పుట్టిన రోజు వేడుకలను హిందూపురంలోనే తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానుల మధ్య జరుపుకుంటున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా నేడు ఉదయం బాలకృష్ణ హిందూపురం సుగూరు అంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు బాలయ్యను ఆశీర్వదించారు. అనంతరం అక్కడి పార్టీ కార్యకర్తలు, నాయకులు బాలయ్యకు శుభాకాంక్షలు తెలపడానికి భారీ ఎత్తున వచ్చారు.

Also Read : Balakrishna : బాలయ్య బర్త్‌డే స్పెషల్.. సినిమాల్లో, రాజకీయాల్లో హ్యాట్రిక్ కొట్టి దూసుకుపోతున్న ‘లెజెండ్’..

ఇక బాలకృష్ణ నేడు హిందూపురంలోనే తొలిసారి అబిమానులు, తెలుగు తమ్ముళ్లు మద్య పుట్టిన రోజు వేడుకలు జరుపోకోనున్నట్టు సమాచారం. అలాగే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచినందుకు కూడా నేడు సెలబ్రేషన్స్ చేయనున్నారు బాలయ్య అభిమానులు.