Fahadh Faasil: అక్షరాలా రూ.15 కోట్లు.. బావమరిది పాత్రకి భారీ డిమాండ్.. హీరో, డైరెక్టర్ ఎవరో తెలుసా!
తెలుగు సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న మలయాళ స్టార్(Fahadh Faasil).
Fahadh Faasil playing key role in Venkatesh and Anil Ravipudi film
Fahadh Faasil: పుష్ప సినిమాతో తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్. తన అద్భుతమైన నటనతో ఆడియన్స్ ను ఒక రేంజ్ లో మెప్పించడం ఈ నటుడికి వెన్నతో పెట్టిన విద్య. అందుకే, పాత్ర ఏదైనా అందులోకి పరకాయ ప్రవేశం చేస్తూ ఉంటారు. పుష్ప తరువాత మరో తెలుగు సినిమా చేయని ఈ నటుడు చాలా కాలం తరువాత తెలుగు సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చుపిస్తున్నాడట.
ఆ మూవీ మరేదో కాదు.. విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న కొత్త సినిమా. అవును, మన శంకర వరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి విక్టరీ వెంకటేష్ సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబోలో F2, F3, సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే.
MMM: మళ్ళీ తమిళ హీరోతో.. మైత్రి కొత్త సినిమా.. దర్శకుడు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు?
ఈ మూడు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ కావడం విశేషం. అదే హిట్ మ్యానియాని కంటిన్యూ చేస్తూ మరోసారి ఈ ఇద్దరు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. త్వరలో షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమా 2027 సంక్రాంతికి విడుదల కానుందని సమాచారం. అయితే, కథ ప్రకారం ఈ సినిమాలో వెంకటేష్ బావమరిది పాత్ర చాలా ప్రాముఖ్యత ఉందట. అందుకే, ఆ పాత్ర కోసం ఫహద్(Fahadh Faasil) ను తీసుకుంటున్నారట మేకర్స్. తెలుగు నటుడిని తీసుకుంటే పాత్రలో ఫీల్ పోతుందని అందుకే ఫహద్ ను ఒకే చేశారని తెలుస్తోంది.
ఇక ఈ పాత్ర కోసం ఫహద్ కి ఏకంగా రూ.15 కోట్ల భారీ రెమ్యునరేషన్ ఇస్తున్నారట మేకర్స్. ఫహద్ కెరీర్ లో ఇదే హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ కావడం విశేషం. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. మరి తెలుగులో విలన్ గా మెప్పించిన ఫహద్ ఫాజిల్ వెంకటేష్ కి బావమరిదిగా ఏమేరకు మెప్పిస్తాడు అనేది చూడాలి.
