Balakrishna : బాలయ్య బర్త్‌డే స్పెషల్.. సినిమాల్లో, రాజకీయాల్లో హ్యాట్రిక్ కొట్టి దూసుకుపోతున్న ‘లెజెండ్’..

ఏ హీరో అభిమాని అయినా, ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా జై బాలయ్య అనే స్లోగన్ అనాల్సిందే.

Balakrishna : బాలయ్య బర్త్‌డే స్పెషల్.. సినిమాల్లో, రాజకీయాల్లో హ్యాట్రిక్ కొట్టి దూసుకుపోతున్న ‘లెజెండ్’..

Balakrishna Birthday Special Story Hat Trick win With Movies and Politics

Updated On : June 10, 2024 / 9:21 AM IST

Balakrishna Birthday Special : బాలకృష్ణ కంటే కూడా బాలయ్య బాబు అని పిలవడమే అందరికి ఇష్టం. కెరీర్ మొదట్నుంచి కమర్షియల్ తో పాటు పౌరాణికాలు, సామాజిక అంశాలపై ఇప్పటికే 108 సినిమాలు తీసి త్వరలో 109వ సినిమాతో రాబోతున్నారు బాలయ్య. నందమూరి తారక రామారావు వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య ఇప్పుడు ప్రపంచంలో ఏ మూల తెలుగు వాళ్లున్నా జై బాలయ్య అనేలా ఎదిగారు. 60 ఏళ్ళ వయసులో చాలా మంది హీరోలు సినిమాలు చేస్తున్నా బాలయ్య మాత్రం స్పెషల్.

Also Read : Balakrishna – Boyapati : బాలయ్య బోయపాటి సినిమా అప్డేట్ వచ్చేసింది.. బాలకృష్ణ బర్త్‌డే స్పెషల్.. అఖండ 2..?

నేడు జూన్ 10 బాలకృష్ణ పుట్టిన రోజు. దీంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు, నెటిజన్లు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం బాలయ్య అటు సినిమాల్లోనూ, ఇటు రాజకీయాల్లోనూ దూసుకుపోతున్నారు. కొన్నాళ్ల క్రితం వరుస ఫ్లాప్స్ చూసిన బాలయ్య బోయపాటి దర్శకత్వంలో అఖండ సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టి తన కెరీర్ లో 100 కోట్ల కలెక్షన్స్ మొదటిసారి సాధించారు. అదే ఊపులో ఆ తర్వాత వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ 100 కోట్ల హిట్స్ కొట్టి 63 ఏళ్ళ వయసులో హ్యాట్రిక్ సాధించారు బాలయ్య. త్వరలో బాబీ దర్శకత్వంలో ఓ మాస్ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత అఖండ 2 సినిమా కూడా లైన్ లో పెట్టారు. మరో వైపు అన్‌స్టాపబుల్ షోతో కూడా మూడు సీజన్స్ సక్సెస్ ఫుల్ గా నడిపించి అదరగొట్టారు.

Balakrishna Birthday Special Story Hat Trick win With Movies and Politics

ఇలా సినిమాల్లో దూసుకుపోతూనే మరోవైపు రాజకీయాల్లో కూడా హ్యాట్రిక్ కొట్టారు. గతంలో హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా 2014, 2019 లో గెలిచిన బాలయ్య ఇటీవల మరోసారి ఏపీ ఎన్నికల్లో అదే హిందూపురం నుంచి గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించారు. దీంతో తెలుగుదేశం కార్యకర్తలతో పాటు బాలయ్య అభిమానులు కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు. 63 ఏళ్ళ వయసులో మరింత యాక్టివ్ గా సినిమాలు చేస్తూ, రాజకీయాల్లో ఉంటూ, వేరే సినిమా ఈవెంట్స్ కి వస్తూ, ఓటీటీ షోలతో.. ఇలా అన్ని వైపులా నుంచి బిజీగా, ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ కి సంతోషాన్ని ఇస్తున్నారు బాలయ్య.

Balakrishna Birthday Special Story Hat Trick win With Movies and Politics

ఏ హీరో అభిమాని అయినా, ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా జై బాలయ్య అనే స్లోగన్ అనాల్సిందే. అంతలా బాలయ్య బాబు జనాలకు కనెక్ట్ అయ్యారు. నేడు బాలయ్య పుట్టిన రోజు కావడం, ఇటీవలే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలవడంతో అభిమానులు శుభాకాంక్షలు చెప్తూ సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఇక బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా ఇప్పటికే బాలయ్య – బోయపాటి సినిమా అప్డేట్ కూడా వచ్చేసింది.